మెగా అల్లుడి సినిమా లాంచ్: చిరు క్లాప్

ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ మొదటి సినిమా స్టార్ట్ అయ్యింది. గత కొంత కాలంగా సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అనేక రూమర్స్ మెగా అభిమానులు చాలా కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు చాలా వార్తలు వచ్చాయి గాని అధికారికంగా ఎవరు చెప్పలేదు. కానీ ఫైనల్ గా ఈ రోజు ముహూర్తం టైమ్ కి మొదటి క్లాప్ పడింది. అల్లుడి కోసం మెగాస్టార్ మొదటి క్లాప్ కొట్టారు.

ఇక దర్శకదీరుడు ఎస్ఎస్.రాజమౌళి తొలి షాట్ కి దర్శకత్వం వహించగా ఎమ్ఎమ్.కీరవాణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదట అందరు అనుకున్నట్టుగానే సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. అలాగే రాకేష్ శశి దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుముందు రాకేష్ జతకలిసే సినిమాను తెరకెక్కించాడు. ఇక మెగా ఫ్యామిలీ ఎక్కువగా ఆర్బాటం చేయకుండా సింపుల్ గా చిరు లాంచింగ్ కార్యక్రమాలను ఫినిష్ చేశారు.

ఇక సినిమాలో ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. రాజమౌళి సినిమాలకు వర్క్ చేసే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. అలాగే రంగస్థలం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ కూడా సినిమా యూనిట్ తో చేతులు కలిపారు. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా ఫాథర్ సన్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరి కళ్యాణ్ మెగా సపోర్ట్ తో తన కెరీర్ ను ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *