మెగాస్టార్ రికార్డుపై ఎన్టీఆర్ గురి.. నష్టాలు.. ఆదుకోవడానికి కల్యాణ్ రామ్ రెడీ!

టాలీవుడ్‌లో సూపర్ హిట్ టాక్ వచ్చినా గానీ డిస్టిబ్యూటర్లు లాభాల దారిని పట్టడం లేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా జై లవకుశ విషయంలోనూ అదే జరిగింది. అందుకు కారణం భారీ రేట్లకు సినిమా పంపిణీ హక్కులను అమ్మడమే అనే మాట వినిపిస్తున్నది. దాంతో నష్టాల పాలైన పంపిణీదారులను ఆదుకోవాలని నిర్మాత కల్యాణ్ రామ్ నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

జై లవకుశ చిత్రం ఓవరాల్‌గా సుమారు 80 కోట్ల షేర్ (నికరం) రాబట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ చిత్ర పంపిణీ హక్కులను 86 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. అయితే పంపిణీదారులకు పెట్టిన పెట్టుబడి రావాలంటే ఇంకా 6 కోట్లు కలెక్ట్ చేయాల్సిందే.

ఈ నేపథ్యంలో పంపిణీదారులు నష్టాన్ని పూడ్చేందుకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కింద తీసుకొన్న మొత్తంలో నుంచి కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కల్యాణ్ రామ్ నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన మీడియాలో రాకపోవడం గమనార్హం. ఈ విషయంలో కల్యాణ్ రామ్ నిర్ణయం కరెక్ట్ కాదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

నైజాంలో జై లవకుశ చిత్రాన్ని పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాతకు రూ.3 కోట్లు చెల్లించేందుకు కల్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడట. ఇక మిగితా డిస్టిబ్యూటర్ల కూడా నష్టాల్ని సెటిల్ చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే కల్యాణ్ రాంను అభినందించక తప్పదు అంటున్నారు సినీ వర్గాలు.

ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 చిత్రం క్రియేట్ చేసిన 164 కోట్ల గ్రాస్ కలెక్షన్ల రికార్డును అధిగమించేందుకు జై లవకుశ పరుగులు పెడుతున్నది. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఇటీవల శ్రీమంతుడు రికార్డును కూడా తుడిచేసినట్టు తెలుస్తున్నది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు జై లవకుశ 162 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *