ఆ మాటలతో ఎన్టీఆర్ హర్టయ్యాడా??

జూ.ఎన్టీఆర్ మొన్న జనతా గ్యారేజ్ హిట్టు కొట్టేశాక కాస్త రిలాక్స్ అయిపోయాడనే చెప్పాలి. అప్పటివరకు నెంబర్ గేమ్ లో కాస్త వెనుకబడ్డాడు కాని.. ఆ సినిమాతో పూర్తి స్థాయిలో ఆకలి తీరిపోయింది. అందుకే ఇప్పుడు సినిమాల సంఖ్య మరియు వేగం కంటే కూడా నాణ్యతపైనే బాగా ఫోకస్ చేస్తున్నాడట.

ఇప్పుడు నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్లో సర్దార్ ఫేం బాబీ డైరక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇతర క్యారెక్టర్లతో ఇప్పటివరకు షూట్ నడిపిస్తున్నా కూడా.. ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు జాయిన్ అవ్వలేదు. అదేంటయ్యా అంటే.. మనోడు ఇప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడట. మొన్న ముహూర్తం ఈవెంట్లో ఎన్టీఆర్ ను చూసి అసలు ఏమాత్రం కొత్త లుక్ ప్రయత్నించలేదు అంటూ మీడియాలో విమర్శలు రావడంతో.. ఇప్పుడు మనోడు వెంటనే హర్టయిపోయి.. ఈసారి తనను తాను ఇంకా కొత్తగా చూపించాలని ఫిక్సయి.. వెంటనే కసరత్తులు మొదలెట్టేశాడని తెలుస్తోంది.

ఆల్రెడీ మొన్న నాన్నకు ప్రేమతో సినిమాలో తన కొత్త లుక్ తో అలరించిన ఎన్టీఆర్.. తరువాత జనతా గ్యారేజ్ లో కూడా బాగానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరి ఈ కొత్త సినిమాలో ఎలా ఉండబోతున్నాడో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *