నేటి నుంచి అమ్మకు ఆత్మీయతతో…కేసీఆర్ కిట్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లీ బిడ్డలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా  ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘కేసీఆర్‌ కిట్‌’ల పథకం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో గ‌ర్భిణిగా పేరు న‌మోదు చేసుకుని, వైద్య ప‌రీక్ష‌లను చేయించుకుని ప్ర‌స‌వించిన త‌ల్లికి వాయిదా ప‌ద్ద‌తిలో న‌గ‌దును అంద‌జేస్తారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఈ పథకం కింద రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిచ్చిన వారికి రూ.12 వేల‌ను అందిస్తారు.

రాష్ట్రంలో 841 హాస్పిటల్లో ఇవాళ్టి నుంచి కేసీఆర్ కిట్ల పంపిణి ప్రారంభమవుతుంది. రూ. 12 వేలతో పాటు అమ్మాయి పుడితే అదనంగ వెయ్యి ఇస్తారు. ఆ పైసల్ని నాలుగు విడతలల్లో బాలింతల బ్యాంకు ఖాతాలల్లో జమ చేస్తుంది సర్కార్
మొద‌టి విడ‌త న‌గ‌దు: ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో గ‌ర్భిణిగా పేరు న‌మోదు చేయించుకుని క‌నీసం రెండు సార్లు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌రువాత రూ. 3వేలు అంద‌జేస్తారు.
రెండో విడ‌త న‌గ‌దు: ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో ప్ర‌స‌వించిన త‌రువాత ఆడ‌బిడ్డ పుడితే రూ.5వేలు, మ‌గ బిడ్డ పుడితే రూ. 4వేలు అంద‌జేస్తారు.
మూడో విడ‌త న‌గ‌దు: బిడ్డ పుట్టిన‌ప్పటి నుంచి మూడున్న‌ర నెల‌ల కాలంలో ఇవ్వ‌వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. రెండు వేలు
నాలుగో విడ‌త న‌గ‌దు: బిడ్డ పుట్టిన‌ప్ప‌టి నుంచి 9 నెల‌ల కాలంలో ఇవ్వ వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. మూడు వేలు ఇస్తారు. ఈ నాలుగు విడ‌త‌లుగా ఇచ్చే మొత్తం న‌గ‌దు బిడ్డ త‌ల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జ‌మ అవుతాయి.

అర్హతలు.. :

() ఆధార్  కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరి

() మొబైల్ నంబర్

()మాతా శిశుసంరక్షణ కార్డు

()రెండు కాన్పుల వరకే ఆర్థికసాయం

() ఒకవేళ మొదటి కాన్పులో కవలలైతే ఒకసారే ఆర్థికసాయం చేస్తారు.

()కవలలిద్దరికీ రెండు కిట్లు అందజేస్తారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *