PSPK 25 కీర్తి సురేష్ లుక్ అదిరింది!

‘నేను శైలజ’ తో మొదటి సినిమాకే మొదటి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలో ఎంతో పద్దతిగల అమ్మాయిగా కనబడి ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత కూడా కీర్తి సురేష్ ఎటువంటి గ్లామర్ వేషాలు వెయ్యలేదు. తెలుగు, తమిళంలో కూడా గ్లామర్ ని పక్కనపెట్టి.. తన అందం, నటన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే కీర్తి అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది. ‘నేను లోకల్’ సినిమాలో కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న కీర్తి చేతిలో ప్రస్తుతం రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘మహానటి’లో సావిత్రి పాత్రని పోషిస్తున్న కీర్తి సురేష్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన కూడా ఛాన్స్ దక్కించుకుంది.

ఇక పవన్ కళ్యాణ్ PSPK 25 లో కూడా కీర్తి సురేష్ గ్లామర్ కి చోటివ్వకుండా ఎంతో పొందికగా.. ట్రెడిషనల్ గా కనబడుతుందనే విషయం మంగళవారం కీర్తి పుట్టున రోజు సందర్భంగా వదిలిన ఆ లుక్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ లుక్ లో కీర్తి సురేష్ అదిరిపోయే అందంతో నవ్వుతూ చీరకట్టులో మెరిసిపోతుంది. మరి సినిమాలో కీర్తి పాత్ర ఎలా వున్నా ఈ లుక్ లో కీర్తి అందం మాత్రం కేక అనేలా వుంది. ఇంతకుముందు పవన్ పుట్టినరోజునాడు పవన్, కీర్తి లు ఉన్న లుక్ లో కూడా కీర్తి సురేష్ ముద్దుగా కనబడి ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఈ లుక్ లో కూడా కీర్తి సురేష్ ముద్దుగా, బొద్దుగా నవ్వుతో అదరగొడుతుంది.

ఇక PSPK 25 లో ఇలా చీరకట్టులో అదరగొట్టిన కీర్తి సురేష్.. ‘మహానటి’ ఫస్ట్ లుక్ లో మాత్రం కళ్ళతోనే అదరగొట్టేసింది. కీర్తి సురేష్ లుక్ ని పూర్తిగా వదలకుండా మహానటిగా కీర్తి కళ్ళను మాత్రమే పరిచయం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మరి ఈ రెండు సినిమాల లుక్స్ లోను… కీర్తి రెండు డిఫరెంట్ లుక్స్ తో ఇరగదీసిందంటున్నారు అభిమానులు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *