కోహ్లి,ధోనిపై జంబో ప్రశంసలు

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లిపై అభినందనల జల్లు కురుస్తునే ఉంది. విరాట్ కోహ్లి అద్భుతమైన ఫాం చూసి మాజీ ఆటగాళ్లు నివ్వేరపోతున్నారు. విరాట్‌ని బ్రాడ్ మన్‌, వివియన్ రిచర్డ్స్ సరసన పొలుస్తూ కీర్తిస్తున్నారు. కోహ్లి అద్బుత ఆటతీరుతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయమని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు గుప్పించగా తాజాగా టీమిండియా కోచ్‌ అనిల్ కుంబ్లే … విరాట్‌ని ఆకాశానికెత్తేశాడు.

ఎనమిదేళ్ల క్రితం నేను చూసిన కోహ్లి వేరు ఇప్పుడు చూస్తున్న కోహ్లి వేరంటూ జంబో ప్రశంసలు గుప్పించాడు. విరాట్ గురించి ఒక్క మాటలో వర్ణించలేమని … అతని స్పూర్తి, అంకిత భావం అనితర సాధ్యమంటు పొగడ్తలు గుప్పించాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును విజేతగా నిలిపిన అనంతరం అతను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి అడుగుపెట్టాడని … అప్పటి నుంచి ఇప్పటిదాకా కోహ్లి తన ఆటతీరును మెరుగుపర్చుకుంటు వచ్చాడన్నారు.

ఇక మాజీ మాజీ కెప్టెన్‌ ధోని మీదా కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘రాంచి లాంటి ప్రాంతం నుంచి వచ్చినవాడు భారత జట్టుకు కెప్టెన్‌ అవుతాడని ఎవ్వరూ అనుకోరు. పదేళ్ల పాటు జట్టును అతను నడిపించిన తీరు… అతను నడుచుకున్న వైనం అద్భుతం. ఇది చాలా కష్టమైన విషయం. పదేళ్ల పాటు ఒక భారత జట్టుకు ఒకరే కెప్టెన్‌గా ఉండటం మనం ఎప్పుడూ వినలేదన్నారు.

విరాట్‌ నాయకత్వ బాధ్యతల్లోకి వెళ్లాక తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకున్నాడని ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రూట్ అన్నాడు . బ్యాటింగ్‌ బాగా చేస్తున్న ఆటగాడికి కెప్టెన్సీ అప్పగిస్తే అది అతడి బ్యాటింగ్‌ను దెబ్బ తీస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ కోహ్లి అలాంటి అంచనాలను తప్పని నిరూపించాడన్నాడు. కేవలం బ్యాట్స్‌మన్‌గా ఉన్నపుడు టెస్టుల్లో అతడి సగటు 41 అయితే.. కెప్టెన్‌ అయ్యాక అది 67కు పెరిగిందని తెలిపాడు. కెప్టెన్సీ రూట్‌ బ్యాటింగ్‌ను దెబ్బ తీస్తుందని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రూట్‌ ఇలా స్పందించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *