ధోని టైమ్ అయిపోయింది…ఇక తప్పుకో: గవాస్కర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే సమయం వచ్చేసిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతనే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని సూచించాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ ఇప్పటివరకు తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీల్ గవాస్కర్.. ధోనీ రిటైర్మెంట్ గురించి స్పందించాడు. `ధోనీకి లక్షలాది మంది అభిమానులున్నారు. వాళ్లలో నేనూ ఒకడిని. అందుకే అతడి మీద గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్ అయిపోయింది. అతడి నిర్ణయం కోసం మేనేజ్‌మెంట్ ఎదురుచూస్తోంది. వచ్చే టీ-20 ప్రపంచకప్ సమయానికి ధోనీ వయసు 39 ఏళ్లు. ఆ వయసులో క్రికెట్ ఆడడం చాలా కష్టం. అందువల్ల ధోనీయే గౌరవంగా తప్పుకుంటే మంచిది. ఉద్వాసన పలికే అవసరం రాకుండా ధోనీయే గౌరవంగా వీడ్కోలు చెబుతాడని భావిస్తున్నా` అంటూ గవాస్కర్ పేర్కొన్నాడు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *