కర్ణుడిచావుకు లక్ష కారణాలు.. ‘లై’ మునిగిపోవడానికి..!

నితిన్ నటించిన ‘లై’ చిత్రం భారీ పరాభవాన్ని మూటగట్టుకుని నష్టాల బాట పట్టింది. విడుదలకు ముందు స్టైలిష్ మేకింగ్ తో భారీ అంచనాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇండిపెండన్స్ డే సందర్భంగా విడుదలైన చిత్రాలతో పోటీ పడలేక చతికల బడింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ చిత్రం కేవలం 10 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.

సినిమాని రిచ్ గా, స్టైలిష్ గా చిత్రీకరించినా.. అందరికి కనెక్ట్ అయ్యే కథ కాకపోవడం, దీనికి తోడు రెండు పెద్ద చిత్రాలతో పోటీ ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్ర్రం పై ఆసక్తి కనబరచక పోటంతో లై ఈ స్థాయిలో పరాజయం పొందిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దర్శకుడు హను రాఘవపూడి కథ, కథనంలో క్లారిటీ లేకపోవడం కూడా ఈచిత్రానికి మైనస్ గా మారింది. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్న చందనాన్ని లై మూవీ ఫెయిల్యూర్ కు పైవన్నీ కారణాలుగా మారాయని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *