రివ్యూ : లై యాక్షన్ మూవీ లవర్స్ కు ఛాయస్

కథ :

ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.

అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది.

‘అ.. ఆ’ తర్వాత స్టైల్ పూర్తిగా మార్చేసిన నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో భారీ నిరుత్సాహాన్ని కలిగించే విషయం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి.

సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ – నితిన్ లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడు ను చెడగొడతాయి. సినిమాలో దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి.

సాంకేతిక విభాగం :

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది.

ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.

విడుదల తేదీ : ఆగష్టు 11, 2017

రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : హను రాఘవపూడి

నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : మణిశర్మ

నటీనటులు : నితిన్, మేఘ ఆకాష్, అర్జున్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *