సినిమాలకు గుడ్‌బై.. మనోజ్ సంచలన నిర్ణయం !

విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన మంచు మనోజ్ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. తాను చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నాని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. సినిమాల నుంచి తప్పుకోవాలని తీసుకొన్న నిర్ణయం వెనుక ఏమున్నదనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. నట జీవితం నుంచి వైదొలగాలకోవడం వెనక కారణాలను మనోజ్ వెల్లడిస్తాడా? లేక అభిమానుల ఒత్తిడి మేరకు మనసు మార్చుకొంటారా అనే ప్రశ్నలు ప్రస్తుతం లేస్తున్నాయి.

మంచు మనోజ్ బుధవారం ఉదయమే సంచలన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక్కడు మిగిలాడు, ఆ తర్వాత చేసే నా చిత్రం నా చివరి సినిమా అని అన్నారు. నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.మనోజ్ నిర్ణయంపై చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పలువురు అభిమానులు సూచిస్తున్నారు. మనోజ్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నది. నట జీవితం నుంచి తప్పుకోవడం వెనుక కారణమేంటనే ప్రశ్న అర్థంకాకుండా ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *