అరెస్ట్ అయిన ముంబాయి పేలుళ్ళ సూత్రధారిs హఫీజ్ సయూద్

ముంబాయి బాంబు పేలుళ్ళ సూత్రధారి  హఫీజ్ సయీద్ ను పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాహోర్ నుండి గుజ్రాన్ వాలా వెళ్తున్న ఆయన్ని ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన విషయానికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా నిధులు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేశారు.

2008 నవంబరులో ముంబయిలో ఉగ్రవాదులు మారణహోమం జరిగింది. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి హఫీస్‌ జయీద్‌ సూత్రధారి. దీనితో సయూద్ ను  అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పుడు సయూద్ ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నారు. అయితే  సయీద్‌ అరెస్ట్‌ వార్తలను భారత్‌ ధ్రువీకరించలేదు. గతంలోనూ పాకిస్తాన్‌ ఇలాంటి వార్తలను ప్రచారం చేసిందని, దీన్ని తాము నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *