4.8 లక్షల ఫోనా…

ఎప్పటినుండో ఊరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ రెడ్‌ మి కె20 ప్రో బుధవారం భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది. కే అంటే కిల్లర్ అనే అర్ధం వచ్చే ఈ ఫోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బుధవారం ఢిల్లీ లో జరిగే ఈ లాంచ్ కార్యక్రమంలో రెడ్‌మి కె20, కె20ప్రోలతో పాటు రెడ్‌మి కె20ప్రో  స్పెషల్‌ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నట్టు షావోమి ఇండియా ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.4.8 లక్షల రూపాయిలు.

ఈ ప్రత్యేక ఫోన్‌ బ్యాక్‌ కేస్‌ను బంగారంతో తయారు చేయగా, వజ్రాలతో పొదిగిన ‘కె’ అక్షరాన్ని లోగోగా అమర్చారు. ఇక బ్లూ,రెడ్‌, బ్లాక్‌ రంగుల్లో లభ్యం కానున్న రెడ్‌మికే 20 ప్రొ బేస్ (‌6జీబీ, 64జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 24,900 నుంచి ప్రారంభంకానున్నాయని అంచనా.  6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్‌, వెనుకవైపు 48+13+8 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, ముందువైపు 20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం దీని ఫీచర్లు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *