రివ్యూ : నీవెవ‌రో మూవీ

క‌థ‌:
క‌ల్యాణ్ (ఆది పినిశెట్టి) చిన్న వ‌య‌సులోనే క‌ళ్లు పోగొట్టుకుంటాడు. అయినా అత‌నికి అది పెద్ద లోటుగా తెలియదు. ఆత్మ విశ్వాసం ముందు అంగ‌వైక‌ల్యం లెక్క‌లేద‌న్న‌ది ఆయ‌న సిద్ధాంతం. అదే న‌మ్మ‌కంతోనే మంచి చెఫ్‌గా ఎదుగుతాడు. అత‌ని చిన్న‌నాటి స్నేహితురాలు అను (రితికా సింగ్‌) జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేస్తుంటుంది. త‌న ఫ్రెండ్‌ని ప‌త్రిక‌ల ప‌రంగా బాగా ప్రోత్స‌హిస్తూ ఉంటుంది. అత‌న్ని పెళ్లి చేసుకుంటాన‌ని త‌ల్లిదండ్రులు (స‌త్య కృష్ణ‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌)కు చెబుతుంది. వాళ్లిద్ద‌రూ డాక్ట‌ర్ల‌యిన‌ప్ప‌టికీ, చిన్న‌ప్ప‌టి నుంచీ వారికి క‌ల్యాణ్ త‌ల్లిదండ్రులు (శివాజీరాజా, తుల‌సి)తో బాగా ప‌రిచయం ఉండ‌టం వ‌ల్ల పెళ్లికి ఒప్పుకొంటారు. అను మీద క‌ల్యాణ్‌కి అప్ప‌టిదాకా ఎలాంటి ప్రేమా ఉండ‌దు. స్నేహితురాలు అనే భావ‌న ఉంటుంది. స‌రిగా ఆ స‌మ‌యంలోనే క‌ల్యాణ్ జీవితంలోకి వెన్నెల (తాప్సీ) ప్ర‌వేశిస్తుంది. అత‌నితో ఆమెకున్న ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అదే స‌మ‌యంలో ఆమె కాల్ మ‌నీ క‌ష్టాల్లో ఉన్న‌ట్టు అర్థం చేసుకున్న క‌ల్యాణ్ త‌న ద‌గ్గ‌రున్న రూ.25ల‌క్ష‌ల‌ను ఆమెకు ఇవ్వ‌డానికి ముందుకొస్తాడు. అంత‌లోనే అత‌నికి యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ఈ సారి జ‌రిగిన ఆప‌రేషన్ వ‌ల్ల చూపుకూడా వ‌స్తుంది. క‌ళ్లు తెరిచేస‌రికి అత‌నికి వెన్నెల క‌నిపించ‌దు. ఆమె ఏమైన‌ట్టు…? కాల్ మ‌నీ గొడ‌వ‌ల్లో వెన్నెల తండ్రి మ‌రణించాడా? అస‌లు వెన్నెల తండ్రి మ‌ర‌ణం వెనుక ఉన్న ప‌థ‌కం ఏంటి? ఎవ‌రు విల‌న్‌? చివ‌రికి క‌ల్యాణ్ ఎవ‌రిని చేసుకున్నాడు? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.
ఫస్టాఫ్‌లో అంధుడైన కల్యాణ్ రెస్టారెంట్ నిర్వహించే అంశంతో కథ ప్రారంభమై సినిమాలోని పాత్రలను పరిచయం చేసుకొంటూ వెళ్తుంది. మద్యం ప్రియులైన కల్యాణ్ తల్లిదండ్రుల (తులసి, శివాజీ రాజా), వెన్నెల, ఇతర పాత్రలతో చకచక కథలోకి వెళ్లాడు. కానీ అసలు కథ ఇంటర్వెల్‌కు కూడా మొదలవ్వకపోవడం ప్రేక్షకుడి సహనానికి అద్దం పడుతుంది. వెన్నెల నిజస్వరూపం ఏంటో ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తే రెండో భాగంలో కథపై ఆసక్తి పెరిగి ఉండేదేమో అనిపిస్తుంది.

రెండో భాగంలో ఇక రెండో భాగంలో వెన్నెల ముఠా గుట్టురట్టు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ చిన్న పిల్లల ఆటగా అనేక మలుపులు తిరుగుతుంది. అప్పటికే వెన్నెల పాత్ర ఏంటో సగటు ప్రేక్షకుడికి అర్ధమైపోయేలా ఉంటుంది. ఒక వెన్నెల అంధులను ఎందుకు మోసగించిందే అనే విషయాన్ని కన్విన్స్‌గా చెప్పలేకపోయాడు. కాకపోతే వెన్నెల కిషోర్, సప్తగిరి కామెడీతో ఆ మైనస్ పాయింట్‌ను తెలివిగా కవర్ చేయడం వల్ల రెండో భాగం ఓకే అనిపిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ ;
లీడ్‌ యాక్టర్స్‌ నటన
కథ

మైనస్‌ పాయింట్స్‌ ;
థ్రిల్లర్‌ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం
సెకండ్‌ హాఫ్‌

టైటిల్ : నీవెవరో
రేటింగ్‌: 2.5/5
తారాగ‌ణం: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్యంగార్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్ త‌దిత‌రులు
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
దర్శకత్వం : హరినాథ్‌
సంగీతం : అచ్చు రాజమణి, ప్రసన్‌
నిర్మాత : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్‌

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *