టీజర్ టాక్: నేనే రాజు నేనే మంత్రి

స్టార్ నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ టీజర్ చూస్తే సినిమా పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా ఉండనుందనే సంగతి ఇట్టే అర్థమవుతోంది. అంతేగాకా రాజకీయనాయకుడిగా రానా లుక్ కూడా గంభీరంగా, ఆసక్తికరంగా ఉంది.

ఇప్పటివరకు సరైన హీరోయిజం తెరపై చూపించలేకపోయినా రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాతో మాత్రం భల్లాలదేవ అంటూ విలనీ బాగానే పండించాడు. అందుకే అలాంటి షేడ్స్ ఒక పాత్రను హీరోగా చూపిస్తే రానా అందులో ఎలా ఉంటాడు? బాగానే ఇమిడిపోతాడు అనిపిస్తోంది. తేజ డైరక్షన్లో రూపొందుతున్న ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా టీజర్ ను చూస్తే అలాగే అనుకోవాలి మరి.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తేజ ఇంతవరకు టచ్ చేయని సబ్జెక్టు తో ఇది వస్తోంది. టీజర్ చిన్నదే అయినా కాన్సెప్ట్ ని చెప్పే ప్రయత్నం చేసారు. పొగరుబోతు అయిన ఒక రాజకీయ నాయకుడి కథే నేనే రాజు నేనే మంత్రి.తన మాటే నెగ్గాలి తాను అనుకున్నది జరిగి తీరాలి అనే మొండిపట్టు మనస్తత్వం ఉన్న రానా వైట్ అండ్ వైట్ చొక్కా పంచె లో ఉరికంబం మీద చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అరిగిపోయిన ప్రేమ కథలను పక్కన పెట్టి తేజ ఫ్రెష్ గా ఎంచుకున్న ఈ థీమ్ వర్క్ అవుట్ అయ్యేలాగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెల విడుదల కానుంది. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై ఈ టీజర్ తోనే అంచనాలు మొదలయ్యాయి. మరి టీజర్ తో అయితే తేజలోని ఒరిజినల్ దర్శకుడు బ్రతికే వచ్చాడు అనే ఫీలింగ్ వచ్చింది. మరి సినిమాలో అంత సరుకు కనక ఉంటే తేజ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *