ఎన్టీఆర్‌ సక్సెస్‌, చిరు ఎందుకు ఫెయిల్‌?

‘బిగ్‌బాస్‌’ షో ఏమిటనేది ఆడియన్స్‌కి ఇంకా అంతు చిక్కలేదు. ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్‌కి దీనిని ఆసక్తికరంగా మార్చడమెలా అనేది తెలియడం లేదు. అయినప్పటికీ టీవీ రేటింగ్స్‌లో ఇది అదరగొడుతోంది. ఎన్టీఆర్‌ కనిపించే వారాంతాల్లో అయితే బిగ్‌ బాస్‌ డామినేషన్‌ పతాక స్థాయిలో వుంది. ఇంట్రెస్ట్‌ ఏమాత్రం జనరేట్‌ లేని ఈ షో ఎందుకు క్లిక్‌ అయినట్టు? అట్టహాసంగా చిరంజీవి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎందుకు ఫ్లాపయినట్టు?

ఎన్టీఆర్‌ గొప్ప, చిరంజీవికి క్రేజ్‌ తగ్గింది అంటూ నందమూరి ఫాన్స్‌ జబ్బలు చరుచుకోవచ్చు. కానీ ఇక్కడ ‘క్యూరియాసిటీ’ ఫ్యాక్టర్‌ వర్కవుట్‌ అవుతోందే తప్ప మరింకేమీ కాదు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎలాగుంటుంది, ఏం చేస్తారనేది ఏళ్ల తరబడి చూస్తూనే వున్నారు. ఈ షోకి చిరంజీవి కొత్తగా తీసుకొచ్చిన కొత్తదనం ఏమీ లేదు. పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ఆడియన్స్‌కి ఇలాంటి క్విజ్‌ షోలు రుచించవు.

ఎన్టీఆర్‌ చేస్తోన్న షో ఏమిటనేది తెలుగు ప్రేక్షకులకి క్లూ లేదు. మిగిలిన షోస్‌ మధ్య ఇది డిఫరెంట్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ షో చూడడంపై ఆటోమేటిగ్గా కుతూహలం మొదలైంది. అదే రేటింగ్స్‌లో కనిపిస్తోంది. ఒక పాత షోని ఎంచుకోవడం చిరంజీవి తప్పు అయితే, నార్త్‌లో కాంట్రవర్షియల్‌ షోగా పేరు పడినా కానీ తెలుగులో హోస్ట్‌ చేయడానికి రిస్క్‌ చేయడం ఎన్టీఆర్‌కి ప్లస్‌ అయింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *