రేపటి నుంచి మీ దగ్గరి పాత రూ.500 నోటు..

మీ దగ్గర పాత రూ.500 నోట్లు ఉన్నాయా? ఇంకా వాటిని మార్చుకోలేదా? అయితే.. మీరు భారీ తప్పు చేస్తున్నట్లే. మీ దగ్గరి నోట్లు.. చిత్తు కాగితాలుగా మారిపోయే రోజు దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. భారీ నష్టాన్ని మూట గట్టుకోవాల్సిందే. డిసెంబరు31 లోపు పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునే వీలు ఉంది. అదే సమయంలో పాత రూ.500 నోట్లను బ్యాంకులతో పాటు.. కొన్ని పరిమిత ప్రాంతాల్లో మార్చుకునే వీలు ఉంది.

మెడికల్ షాపులు.. కరెంటు బిల్లులు.. వాటర్ బిల్లులు చెల్లించేందుకు పాత రూ.500 నోట్లతో చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ.. ఆ అవకాశం ఈ రోజు (గురువారం) అర్థరాత్రితో ముగియనుంది. రేపటి నుంచి అంటే.. శుక్రవారం నుంచి పాత రూ.500నోట్లు బ్యాంకుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ నేపథ్యంలో.. మీదగ్గరి పాత రూ.500నోట్లు ఉంటే వెనువెంటనే మార్చేసుకోండి. చివరి రోజుల్లో నోట్లను మార్చుకునేందుకు ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చు. అందుకే.. వీలైనంత త్వరగా పాత రూ.500నోట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

పాత రూ.500నోట్లను రైల్వేస్టేషన్లు.. విమానాశ్రయాలు.. టోల్ ప్లాజాలు.. పెట్రోల్ బంకులు.. పన్ను చెల్లింపులకు అనుమతించారు. అయితే.. ఆ మధ్యన వాటిని అనుమతించటం లేదు. నేటితో..ఉన్న ఒకట్రెండు చోట్ల కూడా పాత రూ.500 నోట్లకు అయుష్షు తీరనుంది. రేపటి నుంచి పాత రూ.500నోట్లు బ్యాంకుల్లో తప్ప మరెక్కడా చెల్లే అవకాశం లేనట్లే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *