సన్నీ ఎంత మాట అనేసింది?

సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హాట్ బేబీ. అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ లోనూ తన సత్తాను చాటుకుంటోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ సర్వేలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం దాటేసుకొని భారతీయులు వెతుకుతున్న వ్యక్తిగా సన్నీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెర్చ్ గురించే ఫ్యాన్స్ గుండెల్లో బాణం దింపే మాటలను సన్నీ వదిలిపెట్టింది. అసలు తన గురించి ఎందుకు అంత వెతుకుతున్నారని ప్రశ్నించింది.

అవునా? అభిమానం చాటుకుంటూ ఆమె కోసం సెర్చ్ చేస్తుంటే…ఎందుకు అంతలా సన్నీ మాటు వదిలేసిందనే కదా సందేహం. అక్కడికే వస్తున్నాం. తన వల్ల భారతీయ సంస్కృతి మంటగలిసి పోతోందంటూ కొందరు విమర్శలు చేయడం బాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి తోటి నటుల నుంచి వివక్ష ఎదుర్కొంటుండాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గట్టి కౌంటర్ ఇచ్చింది. ముందుగా  తన తోటి నటుల గురించి చెప్తూ ఆడవాళ్లను తక్కువగా చూడడం – వివక్ష వంటివి బాలీవుడ్ లో చాలా ఎక్కువని.. వాటిని భరిస్తూనే ఇక్కడి హీరోయిన్లు కెరీర్ కొనసాగిస్తున్నారని సన్నీ వాపోయింది. బాలీవుడ్ లో కంటే పోర్న్ ఇండస్ట్రీలోనే జనాల తీరు హుందాగా ఉంటుందని సన్నీ స్పష్టం చేసింది. పచ్చిగా ఉండే పోర్న్ సినిమాల్లో చేసేటపుడు సైతం జాతి – మతం – సెక్సువాలిటీ గురించి పెద్దగా పట్టించుకోరని బాలీవుడ్ లో మాత్రం వ్యక్తిగత విషయాలన్నీ బయటికి తీసి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  తనపై విమర్శలు చేసేవారు  ఓ విషయం గుర్తుంచుకోవాలని సన్నీ చెప్పింది. తన సినిమాలు చూడాలని తనను భరించమని కానీ.. తాను ఎవ్వరినీ కోరడం లేదని సన్నీ స్పష్టం చేసింది. తన గురించి గూగుల్లో అసలెందుకు వెదుకుతున్నారని సన్నీ సూటిగా ప్రశ్నించింది. కారణాలు ఏవైనా తన గురించి ఎందుకు వెతుకుతున్నారని సన్నీ ప్రశ్నించడం ఆమె అభిమానులను హర్ట్ చేస్తోందట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *