రకుల్ కి ఇంకో కోలీవుడ్ ఆఫర్ వచ్చింది…

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి కోలీవుడ్ నుంచి డిమాండ్ బాగానే పెరుగుతోంది. ఈ మధ్యనే రకుల్ కి విశాల్ సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది కానీ.. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో చివరికి ఈ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది. ఇలా ఓ సినిమాకి ఒప్పుకుని తర్వాత హ్యాండ్ ఇస్తే.. అవకాశాలు రావడం కష్టం అవుతుంది.

కానీ రకుల్ ప్రీత్ కి మాత్రం అంతలోనే మరో కోలీవుడ్ అవకాశం తలుపు తట్టింది. కార్తి హీరోగా వినోద్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఖాయం అయింది. జనవరి చివరినుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఈ మూవీలో నటించాలంటూ రకుల్ కి ఆఫర్ వచ్చింది. ‘ఇప్పటికే కార్తి తనకు టెస్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకునేందుకు జర్చలు జరుగుతున్నాయి’ అని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. కార్తితో జట్టు కట్టడంపై రకుల్ ఇంకా తేల్చుకోలేదట. తాము ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే అయినా.. రకుల్ ప్రీత్ నుంచి ఇంకా అంగీకారం లేదని చెబుతున్నారు. ఈ సినిమాలో కార్తి ఓ పోలీస్ ఆఫీసర్ గా నటించనుండగా.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందట. ఈ ప్రాజెక్ట్ కి రకుల్ ఓకే అయితే మాత్రం.. కార్తి-రకుల్ లకు తెలుగులో కూడా డిమాండ్ ఉండడంతో.. ఇది రెండు భాషల్లోనూ విడుదలైపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *