భరత్ గురించి కొన్ని సంగతులు

హీరో రవితేజ తమ్ముడు భరత్  మరణం సినిమా ఇండస్ట్రీనే కాదు, సినిమా ప్రేక్షకులను కూడా కలవరపరచింది. ఇలాంటి మరణం ఎవరికీ రాకూడదనే మాటలే ఎక్కడయినా వినిపిస్తున్నాయి. తల్లి, తండ్రి కడచూపు చూడని మరణం అది.

భరత్ గురించి కొన్ని సంగతులు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆ వినిపిస్తున్న గుసగుసల ప్రకారం..

భరత్ హీరో రవితేజ కన్నా చిన్న అయినా ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందరూ అనుకుంటున్నట్లు నాలుగేళ్ల క్రితం కాదు. చాలా అంటే చాలా ఏళ్ల క్రితం.

అది కులాంతర వివాహం. భరత్ క్షత్రియుడు. ఆమె కాపు.

అప్పటికి రవితేజ కుటుంబానికి పెద్దగా ఆర్థిక మద్దతులేదు. కానీ భరత్ భార్య ఉద్యోగి. పైగా ఆమెకు చాలా ఆస్తులు వుండేవి. ఆమెకు చెందిన అపార్ట్ మెంట్ లోనే ఆరంభంలో భరత్ అన్నదమ్ములు, తల్లి తండ్రులు వుండేవారు.

పెళ్లయిన తరువాత భరత్, భార్య అమెరికాలో వుండేవారు. ఇద్దరు అక్కడే ఉద్యోగం చేసేవారు.

కానీ తానా సభలకు వచ్చిన ఓ క్లాస్ కామెడీ సినిమాలు తీసే డైరక్టర్ ‘ మీ అన్నలాగే వున్నావు. నిన్ను హీరోను చేస్తా’ అన్నాడు. అంతే భరత్ హైదరాబాద్ లో వాలిపోయాడు. అలా అన్న డైరక్టర్ అతగాడికి తన సినిమాల్లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు.

సినిమాల్లో సరైన పాత్రలు రాక, భరత్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయేది. మందుకొడితే ఆ ఫ్రస్టేషన్ బయటకు వచ్చేది.

భరత్ అంటే భార్యకు పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతోనే, భరత్ ప్రవర్తన కారణంగా ఆ ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చినా, బయటకు వచ్చి వేరే ఇంట్లో వుండేది. అలాంటి దశలో ఆమె స్వంత కుటుంబం కారణంగా ఆస్తులు పోయాయి. అయినా ఉద్యోగం చేసుకుంటూ స్వంతంగా బతికేది.

భరత్ అప్పడప్పుడు ఆమె ఇంటికి వచ్చి, అక్కడ గడిపేవాడు. ఆమెకు రెండు కుక్కలు వుండేవి. అవి అంటే భరత్ కు చాలాఇష్టం. వాటిని చూసుకోవడానికే ఎక్కువగా అక్కడికి వెళ్ళేవాడని అంటారు. అయినా కానీ సమస్యలు ముదిరిపోవడంతో… ఆఖరికి భరత్ భార్య అమెరికా వెళ్లిపోయారు.

అన్నదమ్ములంటే రవితేజకు మాంచి ప్రేమ. ఇద్దరికీ అవసరమైన డబ్బులు రవితేజే ఇచ్చేవాడు.

భరత్ కు ఓ చిత్రమైన అలవాటు వుండేదని తెలుస్తోంది. కారును పేవ్ మెంట్ కు, గోడలకు గుద్దేయడం. అలా గుద్దేసి, మరమ్మతులకు అంటూ అన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఇలా చేయడం వల్ల ఒకటి రెండుసార్లు దెబ్బలు కూడా తగిలించుకున్నట్లు తెలుస్తోంది.

భరత్ చాలా సెన్సిటివ్. రవితేజ పిల్లలను ఐస్ క్రీమ్ కోసం తీసుకెళ్లి, షాపు క్లొజ్ చేసేసామంటే, తీయమని అడిగితే తీయలేదని అద్దం బద్దలు కొట్టేసాడని తెలుసినవాళ్లు అంటారు.

రవితేజకు ఒకబాధ వుంది. తన పరువు పోతోందనే బాధ. అందుకే తండ్రికి పేకాట అలవాటు వుందని, దానివల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి, ఇంటికే పరిమితం చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది. అదేవిధంగా భరత్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. కానీ తల్లి ద్వారా వాళ్లకు సాయం చేస్తూనే వున్నాడని టాక్.

అన్నింటికి మించి, భరత్ మరణ వార్త తండ్రికి తెలిసిందా? అన్న అనుమానం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

భరత్ తండ్రి ముంబాయిలో ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం ముగిసిన తరువాత విజయవాడ షిప్ట్ అయ్యారు. రవితేజ సినిమాల్లోకి రాకపూర్వం అక్కడ కొన్నాళ్లు తండ్రికి వ్యాపారంలో సాయపడేవారని తెలుస్తోంది. విజయవాడలో రవితేజ తండ్రి క్రోకరీ బిజినెస్ చేసినట్లు టాక్.

వన్స్ సినిమాల్లోకి వచ్చాక, అందరూ అన్ని విధాలా బాగున్నారు. కానీ అవకాశాలు రాలేదని, తను కూడా అన్నలాగే వుంటా కదా? చాన్స్ ఇస్తే చేసి చూపిస్తా అని తరచు బాధపడుతూ, భరత్ అలవాట్లకు బానిసయ్యాడు. ఆఖరికి అతని కథ ఇలా ముగిసింది.

అదే కనుక ఆ రోజుల్లో ‘ఆ క్లాస్ కామెడీ సినిమాలు తీసే డైరక్టర్’ కనుక నువ్వు హీరో మెటీరియర్, నిన్ను హీరోను చేస్తా వచ్చేయ్’ అనకపోయివుంటే, భరత్ లో ఆ ఏక్టింగ్ పురుగు కుట్టేదికాదు. జీవితం ఇలా మలుపు తిరిగేది కాదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *