రిలయన్స్ ఎల్ వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్
రిలయన్స్ రిటైల్ ఎల్ వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎల్ వైఎఫ్ విండ్ 7ఎస్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్ టీఈ సపోర్ట్ తో ఈ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.5,699గా కంపెనీ నిర్ణయించింది. విండ్ 7 విజయంతో విండ్ 7ఎస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది.
ఈ ఫోన్ ఫీచర్లు…
5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2250 ఎంఏహెచ్ బ్యాటరీ
9 గంటల 4జీ టాక్ టైమ్, 5 గంటల వీడియో ప్లే బ్యాక్, 32 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది.