చ.. చ… చ చంపేశావ్ తారక్ అంటూ మెగా హీరో ట్వీట్

‘జై లవ కుశ’ ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్రైలర్‌కు 20 గంటల్లోనే 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ ” అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో జై పాత్రకు కాస్త నత్తి ఉంటుంది. అందుకే సాయి ధరమ్ తేజ్ ఇలా ట్వీట్ చేసినట్లు సమాచారం.

జై లవ కుశ ట్రైలర్ పై సాయి ధరమ్ తేజ్ ట్వీట్. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే తారక్ సినిమాకు ఇలా ప్రమోట్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జై లవ కుశ’ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు ‘జై లవ కుశ’ అయినా… సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ… రామ లక్ష్మణులయ్యారు అంటూ ‘జై లవ కుశ’ ట్రైలర్ మొదలైంది.

జై లవ కుశ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *