చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా

తెలంగాణ ప్రభుత్వం, చేనేత శాఖ మంత్రి కెటి రామారావు చేపట్టిన చేనేతకు చేయూత కార్యక్రమానికి ప్రముఖ సినీ తార సమంతా మద్దతు పలికింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దుతు ఇస్తున్నట్లు సమంతా తెలిపింది. చేనేతల కోసం మంత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. వ్యక్తిగతంగా తనకు చేనేత వస్తాలంటే అత్యంత ఇష్టమన్నారు. తాను సాద్యమైనన్ని ఎక్కువ సందర్భాల్లో చేనేత వస్తాలను ధరిస్తానని, చేనేతల ప్రోత్సాహించేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు.

చేనేతను పరిశ్రమపైన తనకు అవగాహన ఉందన్న సమంతా, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించే వివిధ చేనేత ఉత్పత్తుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఇక్కత్, పోచంపల్లి వంటి చేనేతలకు మరింతా వాల్యూ యాడిషన్ చేసేందుకు తనకున్న అలోచనలను అధికారులతో అమె పంచుకున్నారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న పవర్ లూం కార్మికుల ఉత్పత్తులకు మరింత మార్కెట్ కలిపించేందుకు డిజిటల్ ప్రింటింగ్ వంటి టెక్సిక్స్ ఉపయోగించవచ్చన్న సమంతా, త్వరలోనే చేనేతల ప్రోత్సాహం కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాల పూర్తి వివరాలను అందిస్తానని సమంతా తెలిపారు.

కరీంనగర్ జిల్లాలోని చేనేతల నుంచి తాను సేకరించిన పలు రకాల వస్త్రాల సాంపిల్స్ సైతం సమంతా తన వేంట తీసుకుని వచ్చారు. ఇలాంటి వస్తాలకు మార్కెట్ కలిపించేందుకు తనకు తెలిసిన డిజైనర్లు,సంస్థలతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమానికి సమంతా మద్దతు తెలపడం, నేరుగా చేనేతల కోసం పనిచేసేందుకు ముందుకు రావాదం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు. టెస్కో అధికారులు తీసుకుని వచ్చిన పోచంపల్లి చీర, శాలువను మంత్రి సమంతాకు అందించారు. సమంతా చేపట్టే అన్ని కార్యక్రమాలకు సహకరించాలని అధికారులను కోరారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *