కోరిక తీర్చమన్న నిర్మాత.. నటి కేసు

సినీ.. టీవీ రంగంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు.. లైంగిక వేధింపులు ఎప్పుడూ ఉండేవే. కానీ ఇంతకుముందు ఈ వ్యవహారాలు అంతగా బయటికి వచ్చేవి కావు. కానీ ఈ మధ్య మలయాళ నటి భావనపై వేధింపుల కేసుపై విస్తృత ప్రచారం తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోని అమ్మాయిలకు కొంచెం ధైర్యం వచ్చినట్లుంది. ఇలాంటి వేధింపులకు గురవుతున్న వాళ్లు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తమను వేధించిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. తాజాగా ‘బాబీజీ కి ఘర్ పర్’ అనే హిందీ సీరియల్లో నటిస్తున్న శిల్పా షిండే అమ్మాయి తనను ఈ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లి వేధిస్తున్నట్లుగా ముంబయిలోని వాలీవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

సంజయ్ తన కోరిక తీర్చమని బలవంతం చేశాడని.. లేకపోతే సీరియల్ నుంచి తప్పిస్తానని బెదిరించాడని శిల్పా ఆరోపించింది. ముంబయి.. అహ్మదాబాద్ హైవే సమీపంలోని వాసాయి వద్ద షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ తనను లైంగికంగా వేధించాడని.. తాకరాని చోటల్లా తాకాడని శిల్పా తన ఫిర్యాదులో పేర్కొంది. చాన్నాళ్లు ఈ వేధింపుల్ని భరించానని.. ఈ మధ్య అవి శ్రుతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదని ఆమె పేర్కొంది. శిల్పా.. సంజయ్ మీద కేసు పెట్టిన మాట వాస్తవమేనని వాలీవ్ పోలీసులు ధ్రువీకరించారు. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశామని.. ఈ ఆరోపణల ఆధారంగా కోహ్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *