నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆ హీరోనే…. టబు సంచలనం!

ముంబై: హీరోయిన్ టబు పేరు చెప్పగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా. ఆ సినిమా తర్వాత నాగార్జున, టబు హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయారు. అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు కూడా వార్తొలొచ్చాయి.

టబు పెళ్లికి దూరంగా ఉండటానికి కారణం నాగార్జునతో ఎఫైరే అని గతంలో గాసిప్స్ వినిపించాయి. ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చేలా టబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంటికి వెళ్లడం, అతడితో క్లోజ్‌గా మూవ్ అవ్వడం లాంటివి చేసేది.

అదే సమయంలో బాలీవుడ్లో అజయ్ దేవగన్‌, మరికొందరు స్టార్లతో కూడా ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. 45 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి దూరంగా ఉన్న ఈ ప్రౌడ సుందరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లి కాక పోవడానికి కారణం ఎవరో బయట పెట్టేసింది.

తనకు పెళ్లి కాక పోవడానికి, ఇప్పటికీ సింగిల్‌గా మిగిలిపోవడానికి కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అని టబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టబు ఈ విషయం చెప్పగానే అందరూ షాకయ్యారు.దాదాపు 25 సంవత్సరాలుగా అజయ్ దేవగన్ తనకు తెలుసని, ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడని, తామంతా అప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారమని, ఆ సమయంలో అజయ్ తనను ఓకంట కనిపెడుతూ లైన్ వేసేవాడని టబు తెలిపారు.

ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అయ్యేవాడు, వేరే అబ్బాయిలు ఎవరైనా తన వైపు చూసినా, మాట్లాడిన తట్టుకునే వాడు కాదు…. వారిపై దాడి చేసి వార్నింగ్ ఇచ్చేవాడని టబు తెలిపారు.అప్పట్లో అజయ్ ప్రవర్తన చూసి మా మధ్య ఏదో ఉందని అంతా అనుకునే వారు. ఇతర అబ్బాయిలు నాతో మాట్లాడటానికి, నన్ను ప్రేమించడానికి భయపడేవారు. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ముమ్మాటికీ అజయ్ అంటూ నొక్కివక్కానించింది టబు.

అజయ్ దేవగన్‌తో తనది చాలా స్పెషల్ రిలేషన్. నాకు ఎంతో గౌరవం ఇస్తాడు, చాలా బాగా ట్రీట్ చేస్తాడు. అందుకే అజయ్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే…. అంటూ టబు వ్యాఖ్యానించింది. మరి టబు చెప్పిన ఈ విషయాలు అజయ్ దేవగన్ భార్య కాజోల్ విన్నదో? లేదో?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *