సెన్సార్ టాక్: స్పైడర్ కి సూపర్ సర్టిఫికెట్

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఏడాదినుంచి ఊరిస్తున్న మురగదాస్ – మహేష్ కాంబో లో తెరక్కిన స్పైడర్ ఎట్టకేలకు ఈ నెల 27న సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి రెడీ అయ్యింది. మొన్నటి వరకు తుది మెరుగులు దిద్దుకున్న ఈ చిత్రం మొత్తం పనులను పూర్తి చేసుకొని రీసెంట్ గా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇక కేవలం థియేటర్స్ లోకి రావడమే తరువాయి.

అయితే రెండుగంటల 25 నిమిషాల ఈ స్పై థ్రిల్లర్ సినిమా కి సెన్సార్ బోర్డు వారు U/A సర్టిఫికెట్ ని ఇచ్చారు. చిత్ర యూనిట్ తర్వాత మొదటి సారి సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూసి చాలా బావుందని చెబుతున్నారు. ఎక్కడా ఎలాంటి అసబ్యకర సన్నివేశాలు లేకుండా స్వచ్ఛంగా అన్ని వర్గాలు చూసే విధంగా మురగదాస్ తెరకెక్కించారట. ఇక సినిమాలో అనవసరమైన సన్నివేశాలకు దర్శకుడు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదని చెబుతున్నారు. మంచి కమర్షియల్ హంగులను జోడించి సినిమాలో మంచి మెస్సేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూసిన వారంతా తప్పకుండా ఒక కొత్త సినిమాను చూసిన అనుభూతుని పొందుతారని అంటున్నారు. మొత్తానికి సినిమాలో ఒక్క కట్ కూడా చెప్పడానికి వీలు లేకుండా చిత్ర యూనిట్ సినిమా తీసినట్లు వారు చెబుతున్నారు. కాకపోతే ఒకే ఒక్క చిన్న కట్ చెప్పారట.

ముఖ్యంగా మహేష్ పాత్ర చాలా ఆకట్టుకుంటుందని కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ సినిమా స్థాయిని పెంచుతాయని తెలుపుతూ..విలన్ సూర్యా నటన కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని తెలిపారు. ఫైనల్ గా సినిమా మంచి విజయం అందుకుంటుందని సెన్సార్ సభ్యులు తెలిపారు. ఎన్వీ ప్రసాద్ – ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సెన్సార్ యూనిట్ ని థ్రిల్ చేసిన స్పైడర్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *