ఆదిలోనే మెగాస్టార్ ‘సైరా’కు ఆటంకం..అసలేం జరిగింది..?

మెగాస్టార్ 151 చిత్రానికి ‘సైర’ అనే టైటిల్ ఖరారైంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా లాంచ్ అయింది. ఆదిలోనే హంసపాదు అన్న చందాన ఈ చిత్రానికి మొదట్లోనే చిక్కులు మొదలైనట్లు తెలుస్తోంది.

ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కుటుంబీకులు రాయలసీమలో ఉన్నారు. స్వాతంత్ర సమరయోధుడి చరిత్ర ఆధారంగా సినిమా తీస్తూ ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి పేరు పెట్టకుండా సైరా అని పెట్టడం వారిని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని డిమాండ్ చేతున్నారు. సైరా అనే టైటిల్, దాని డిజైనింగ్ అంతా అభిమానులకు బాగా చేరువైపోయింది. ఈ తరుణం లో టైటిల్ ని మార్చడం అంత సులువు కాదు. కానీ నిర్మాతగా చరణ్ ఈ సమస్యని ఎలా అధికమిస్తాడనేది ఆసక్తిగా మారింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు మరియు సుదీప్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. నయనతార హీరోయిన్ ఎంపికైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *