నిర్మాత దిల్ రాజు కు రెండో పెళ్ళి…

టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తగారింటికి వెళ్లిపోవడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారట.  అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో త‌న ఫ్యామిలీలోని  30 ఏళ్ళ అమ్మాయిని మంగళవారం దుబాయ్‌లో వివాహం చేసేసుకున్నారట. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన ఈ పెళ్ళిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నార‌ట‌. మంగళవారం దుబాయ్‌లో వివాహం చేసేసుకున్నారట. ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరినీ పెళ్లికి పిలవలేదట. అయితే దిల్ రాజు స్పోక్స్‌ పర్సన్ మాత్రం అందులో నిజం లేదని, ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని అంటున్నారు. ఈ వార్త‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.  దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది.  2003లో వచ్చిన ‘దిల్’ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తన పేరు ముందు ‘దిల్’ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఈరోజు ఆయన ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. దిల్ రాజు నిర్మించిన జాను చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది.  ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో పింక్ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *