యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి మార్చి 07 వరకు జరిపించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 26 నుండి స్వస్తివాచనముతో ప్రారంభమై 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలు జరగనున్నాయి. మార్చి 4న తిరు కల్యాణ మహోత్సవం, 5వ రోజున గరుడవాహన సేవ రధోత్సవం, 7వ రోజున శ్రీ స్వామి వారి అష్టోత్తర శతఘటాబిషేకం జరగనుంది. దీంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా కొండమీద బాలాలయంలో తిరుకళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండ కింద జడ్పీ హై స్కూల్‌లో ఈ వేడుకలు జరిపిస్తారని ఆలయ ఈఓ గీత తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించామని ఆలయ అధికారులు తెలిపారు. ఏటా జరిగే ధార్మిక సాహిత్య సంగీత మహా సభలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి స్వస్తివాచనముతో ప్రారంభించి సాయంకాలం 6:30కు లకుమృత్సంగ్రహణం అంకురారోపణ జరుగుతుంది.
* 27వ తేదీన ఉదయం11 గంటలకు ధ్వజారోహణం సాయంత్రం భేరిపూజా దేవతహ్వానం, హావణం
* 28వ తేదీన ఉదయం 11 గంటలకు మాస్త్యవతారా అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు శేషవాహన సేవ
* 29వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీ కృష్ణాలంకారము మురళి కృష్ణుడు అవతార సేవ, రాత్రి 9:00గంటలకు హంసవహన అలంకార సేవ మార్చి 1 వ తేదీన ఉదయం వట పత్రసాయి అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు పొన్నవాహన సేవ
* మార్చి 2 వ తేదీన ఉదయం 10:00 లకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 9:00గంటలకు సింహ వాహన సేవ
* మార్చి 3 వ తేదీన ఉదయం జాగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు అశ్వవాహన సేవ బాలాలయంలో శ్రీ స్వామి వారి ఎదుర్కోళ్ల మహోత్సవ* మార్చి 4 వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీరామ అలంకరము హనుమంత సేవ ఉదయం 11 గంటలకు గజావాహన సేవ బాలలయంలో తీరు కల్యాణ * మహోత్సవం, రాత్రి 8:00 గంటల నుంచి 10:00గంటల వరకు శ్రీ స్వామి వారి వైభవోత్సవా కల్యాణ మహోత్సవం జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో భక్తుల సౌకర్యార్థం జరూపించబడును.
* మార్చి 5 వ తేదీన ఉదయం 11:00 గంటలకు శ్రీ మహా విష్ణువు అలంకరము గరుడవహన సేవ. రాత్రి 7:00గంటల నుండి 7:30 నిమిషాల వరకు బాలాలయంలో విమాన రథోత్సవము మళ్లీ కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి రాత్రి 8:00గంటల నుంచి 10:00 గంటల దేవస్థాన ప్రచార రథం ఊరేగింపు.* మార్చి 6 వ తేదీన ఉదయం 10:30 నిమిషాలకు మహా పూర్ణాహుతి చక్రతీర్థం, సాయంత్రం 6:00గంటలకు శ్రీ పుష్పయాగము దేవతోద్వాసన దోపు ఉత్సవము.
* మార్చి 7 వ తేదీన ఉదయం 10:00 గంటలకు శ్రీ స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకము. రాత్రి 9:00 గంటలకు శ్రీ స్వామి వారి శృంగార డోలోత్సవము. ఉత్సవ సమాప్తితో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *