3డి గుండె :కణజాల ఇంజనీరింగ్ లో భారీ ముందడుగు

మనిషి గుండెను 3డీ ముద్రణ ద్వారా తయారు చేసే పరిజ్ఞానాన్ని రూపొందించిన పరిశోధకులు కణజాల ఇంజినీరింగ్‌లో భారీ ముందడుగు వేశారు. గుండెతోపాటు అనేక ఇతర అవయవాలకు ఆధారమైన కొలేజన్‌ను త్రీడీ టెక్నాలజీ ద్వారా ముద్రించేందుకు కార్నెగీ మెలన్‌ వర్సిటీ శాస్త్రవే త్తలు సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఫలితంగా గుండెలోని భాగాలతోపాటు పూర్తిస్థాయిలో పనిచేసే గుండెను కూడా ముద్రించేందుకు వీలు ఏర్పడింది. మృదువైన, జీవ పదార్థాలను ఉపయోగించి మునుపెన్నడూ లేనిరీతిలో సరికొత్తగా 3డీ ముద్రణను సుసాధ్యం చేసినట్లు పేర్కొన్నారు.

కొలేజన్‌ ఇది ఒక ప్రోటీన్. ఇది జీవ రసాయన సమాచార ప్రసారానికి, తద్వారా కణాలు పనిచేసేందుకూ ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌ట్రా సెల్యులార్‌ మ్యాట్రిక్స్‌ ప్రొటీన్ల మధ్య ఆయా కణాలు వృద్ధి చెందడం ద్వారా అవయవాలు తయారవుతాయన్నమాట. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రొటీన్‌ నిర్మాణానికి ఇప్పటివరకూ జరిగినవి విఫల ప్రయత్నాలే. ఫ్రీఫామ్‌ రివర్సిబుల్‌ ఎంబెడ్డింగ్‌ ఆఫ్‌ సస్పెండెడ్‌ హైడ్రోజెల్స్‌ (ఫ్రెష్‌) అనే సరికొత్త పద్ధతిని ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు తాజాగా ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలిగారు. మానవ గుండెకు సంబంధించిన ఎంఆర్‌ఐ సమాచారం ఆధారంగా రోగికి అవసరమయ్యే రీతిలో నిక్కచ్చిగా గుండె నిర్మాణాన్ని రూపొందించగలిగినట్లు అమెరికాలోని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీ ఆడం ఫీన్‌బెర్గ్‌ పేర్కొన్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *