బాలీవుడ్ న‌టుడు వినోద్ ఖ‌న్నా మృతి

బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు వినోద్ ఖ‌న్నా (70) ఇవాళ మృతి చెందారు. గిర్గావ్‌లోని హెచ్ఎన్ రిల‌యెన్స్ అండ్ రీసెర్చ్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న‌.. గురువారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర డీహైడ్రేష‌న్‌తో కొన్ని రోజుల కింద ఆసుప‌త్రిలో చేరారు వినోద్ ఖ‌న్నా. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారాయ‌న‌. 1946, అక్టోబ‌ర్ 6న జ‌న్మించిన వినోద్ ఖ‌న్నా.. 141 సినిమాల్లో న‌టించాడు. 1968 నుంచి 2013 వ‌ర‌కు సినిమా రంగంలో ఉన్నారు. మేరె అప్నే, మేరా గావ్ మేరా దేశ్‌, గ‌ద్దార్‌, జైల్ యాత్ర‌, ఇమ్తిహాన్‌, ఇన్‌కార్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, ఖుర్బానీ, కుద్ర‌త్‌లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్‌లో క‌నిపించారు వినోద్ ఖన్నా. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్త‌లో చిన్న పాత్ర‌లు, నెగ‌టివ్ షేడ్స్ ఉన్న వాటికే ప‌రిమిత‌మైన ఖ‌న్నా.. త‌ర్వాత లీడ్ రోల్స్‌లోనూ చాలా హిట్ మూవీస్‌లో న‌టించారు. 1982లో త‌న ఆధ్మాత్మిక గురువు ఓషో రజ్‌నీష్ వెంట ఉండేందుకు తాత్కాలికంగా సినిమాల నుంచి త‌ప్పుకున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న కెరీర్‌లో పీక్‌లో ఉండేది. ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చిన వినోద్ ఖ‌న్నా.. ఇన్సాఫ్‌, స‌త్య‌మేవ జ‌య‌తే లాంటి హిట్స్ అందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *