విజయ్‌ ఆత్మహత్య: ఎవరీ వనితారెడ్డి.?

సినీ నటుడు విజయ్‌ ఆత్మహత్య చేసుకోవడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ తదితర చిత్రాల్లో నటించిన విజయ్‌ ఆత్మహత్య చేసుకోవడం వెనుక, ఆర్థిక ఇబ్బందులకంట కుటుంబ కలహాలే కీలక భూమిక పోషించాయని తేలింది. తన భార్య కారణంగా తాను మనోవేదనను ఎదుర్కొంటున్నట్లు విజయ్‌, సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. చనిపోవాలని నిర్ణయించుకున్నాక విజయ్‌ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తన కుటుంబం గురించీ, భార్య గురించీ పేర్కొన్నాడు.

విజయ్‌ భార్య వనిత కూడా పలు సినిమాల్లో నటించింది. వంశీ దర్శకత్వంలో ఆర్యన్‌ రాజేష్‌ హీరోగా నటించిన ‘అనుమానాస్పదం’ సినిమాలో వనిత ‘రిజిస్టర్‌’ అయ్యే పాత్రలో కన్పించింది. ప్రస్తుతం ఆమె పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా వుంది. తన భర్త ఇలా చేస్తాడనుకోలేదంటూ ఆమె కన్నీరు మున్నీరవుతోంది. ‘నా భర్త వేధింపులకు తాళలేక, నేనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా కూతురి కోసమే నేను జీవించి వున్నాను.. కానీ, ఇంతలోనే ఆయనిలా చేస్తారనుకోలేదు..’ అంటోందామె.

విజయ్‌, సెల్ఫీ వీడియోలో వనితతోపాటు ఆమె తల్లి వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించాడు. తన కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తాను చనిపోయాక, తన భార్యపైనా ఆమెతోపాటు తనను వేధించిన ఆమె సన్నిహితులపైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఎవర్నీ వదిలిపెట్టకూడదని పేర్కొన్నాడు విజయ్‌ సాయి.

అయితే, విజయ్‌ తనను పెళ్ళి చేసుకున్నాక కొన్నాళ్ళకే తనతో గొడవలు పడ్డాడనీ, అతన్నుంచి దూరంగా వెళ్ళిపోయిన తాను, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాననీ, ప్రస్తుతం ఆ కేసు విచారణలో వుందనీ, ఇంకోపక్క విజయ్‌ మరో పెళ్ళి చేసుకున్నాడనీ, విజయ్‌ జల్సాల కోసం తన దగ్గర్నుంచే డబ్బులు లాక్కునేవాడు తప్ప, తనకెప్పుడూ విజయ్‌ డబ్బులు ఇవ్వలేదని చెబుతోంది వనితారెడ్డి.

ఇంతకీ ఏది నిజం.? విజయ్‌ సాయి జీవించి లేడు గనుక.. ఆయన చేసిన ఆరోపణల్లో నిజమెంత.? అనేది తేలాల్సి వుంది. వనితారెడ్డి చెబుతున్నదీ నిజమేనా.? విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *