రివ్యూ: ‘విశ్వరూపం-2’

కథ:

వీసామ్ (క‌మ‌ల్ హాసన్) ‘రా’ ఏజెంట్. ఇండియాని ఉగ్రవాదుల నుంచి కాపాడే క్రమంలో ఉగ్రవాదులతో మరియు ఒమర్ (రాహుల్ బోస్)తో చేరి వారికి స్నేహితుడిగా నమ్మించి ఉగ్రవాదులు ప్లాన్ లకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు ఇండియాలోని తన పై అధికారికి చేరవేస్తుంటాడు.

ఈ క్రమంలో వీసామ్ కు ఎదురయ్యే ఛాలెంజ్ స్ ఏమిటి ? అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ హెడ్ ని పట్టుకొన్నే క్రమంలో విసామ్ ఎలాంటి పరిస్థితులను అదిగమించాడు ? తనని నమ్మించి మోసం చేసిన వీసామ్ ను ఒమర్ ఎలా అంతం చేయాలనుకున్నాడు ? అంతం చేసే క్రమంలో వీసామ్ ఒమర్ కి సంబంధించి చెప్పిన నిజం ఏమిటి ? చివరకి వీసామ్ ఉగ్రవాదులను అంతం చేసాడా లేదా లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

కథనం – విశ్లేషణ:

కమల్ హాసన్ గొప్ప నటుడే కాదు.. గొప్ప రచయిత.. దర్శకుడు కూడా. ఐతే సగటు ప్రేక్షకుల స్థాయికి మించి ఉండే ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోవడం కష్టమని.. ఆయన సినిమాలు జనరంజకంగా ఉండవని ఒక అభిప్రాయం బలంగా ఉండేది. ఐతే ఆ అభిప్రాయాల్ని తుడిచేసిన సినిమా ‘విశ్వరూపం’. ఉగ్రవాదం నేపథ్యంలో అందరికీ కనెక్టయ్యే కథను ఎంచుకుని.. ఎమోషన్.. యాక్షన్.. థ్రిల్.. అన్నింటినీ సమపాళ్లలో మేలవించి ఈ చిత్రాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దారాయన. ఈ సినిమా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది. దీని సీక్వెల్ చిత్రీకరణ కూడా తొలి భాగం తీసే సమయంలోనే సగం దాకా పూర్తి చేశాడు కమల్. ‘విశ్వరూపం’ రిలీజ్ తర్వాత కొన్ని నెలల్లోనే మిగతా షూటింగ్ కూడా దాదాపుగా అవగొట్టేశాడు. కాబట్టి ‘విశ్వరూపం-2’ కూడా కచ్చితంగా ‘విశ్వరూపం’ లాగే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా ఇది చాలా అనాసక్తికరంగా తయారైంది. తొలి భాగంతో ఎంతమాత్రం పోల్చలేని ఈ సినిమా.. మామూలుగా చూసినా కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ‘విశ్వరూపం’లో ఉన్న థ్రిల్.. ఉత్కంఠ.. ఎమోషన్.. అన్నీ ఇందులో మిస్సయ్యాయి.

‘విశ్వరూపం’లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. గొప్ప ఎమోషన్ కూడా ఉంటుంది. తన కారణంగా అమాయకుడైన తౌఫీక్ ఉగ్రవాదుల చేతిలో హతమవుతుండగా.. అతడి తల్లి హృదయ విదారకంగా రోదిస్తుంటే కరగని మనసుండదు. ఇక అందులో చాలా సింపుల్ గానే హీరోయిజాన్ని పండించిన తీరూ అద్భుతమే. అప్పటిదాకా చాలా అమాయకంగా కనిపించే విశ్వనాథ్.. విసాంగా మారి ఉగ్రవాదుల్ని కళ్లు చెదిరే రీతిలో అంతమొందించే వైనం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అక్కడి నుంచి విసాం పాత్రలోని ఎన్నో కోణాల్ని.. వైరుధ్యాల్ని చూపిస్తూ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ.. థ్రిల్ చేస్తూ సాగుతుంది ‘విశ్వరూపం’. ఇక అందులోని ఆఫ్గనిస్థాన్ ఎపిసోడ్ గురించి.. అందులోని యాక్షన్ ఘట్టాల గురించి చెప్పేదేముంది? ఇలా ఆద్యంతం విశ్వరూపం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తే.. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘విశ్వరూపం-2’ మాత్రం పూర్తి భిన్నంగా సాగుతుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
కమల్‌ హాసన్‌ నటన
ఇంటర్వెల్‌సీన్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ ;
స్లో నేరేషన్‌
పెద్దగా థ్రిల్స్‌ లేకపోవటం
క్లైమాక్స్‌

విడుదల తేదీ : ఆగష్టు 10, 2018
రేటింగ్ : 2.25/5

నటీనటులు : కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా

దర్శకత్వం : కమల్ హాసన్

నిర్మాతలు : కమల్ హాసన్, చంద్ర హాసన్

సంగీతం : మొహమ్మద్ గిబ్రన్

సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్, శాందత్

రచన, స్క్రీన్ ప్లే : కమల్ హాసన్

ఎడిటర్ : మహేష్ నారాయణ్, విజయ్ శంకర్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *