రివ్యూ: “ఇస్మార్ట్‌ శంకర్‌” మాస్ అవతారం

కథ :
ఇస్మార్ట్ శంకర్ (రామ్) ఓల్డ్ సిటీలో స్థానిక రౌడీ శంకర్ తన జీవితాన్ని మార్చే విషయంలో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడుఆ సమయంలోనే పొలిటీషియన్‌ కాశీ రెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌).
అసలు శంకర్‌ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్‌ అరుణ్‌ (సత్యదేవ్‌)కి సంబంధం ఏంటి?

నటీనటులు :
సరికొత్త మేకోవర్‌లో డిఫరెంట్‌ యాటిట్యూడ్‌, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఇబ్బంది పడినా ఓవరాల్‌గా శంకర్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మాస్‌ యాక్షన్‌ సీన్స్‌లో రామ్ పర్ఫామెన్స్‌ సూపర్బ్ అనేలా ఉంది. హీరోయిన్లుగా నభా,నిధి అగర్వాల్‌ గ్లామర్‌ షోలో పోటి పడ్డారు. కథలోనూ ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలు కావటంతో నటనతోనూ ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు. 


విశ్లేషణ :
ఇటీవల ఎదురవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇస్మార్ట్ శంకర్ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేయలేదని గట్టిగా చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది వడ్డించే ప్రయత్నం చేశారు. తన మార్కు డైలాగులు, క్యారెక్టరైజన్స్ మీదే కాన్సంట్రేషన్ చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా విషయంలో రామ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరులో సక్సెస్ అయ్యాడని బలంగా చెప్పవచ్చు. కాకపోతే మిగితా క్యారెక్టర్లను పట్టించుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. రామ్ క్యారెక్టర్ చుట్టు అన్ని క్యారెక్టర్లు కేవలం ప్యాండింగ్‌ మాదిరిగానే కనిపిస్తాయి. ఏ క్యారెక్టర్‌లో బలమైన మార్క్ కనిపించదు.

పూరి తన మూస ఫార్ములా నుంచి ఇంకా  బయటపడలేదనే చెప్పాలి. గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా కాస్త ఎంగేజింగ్‌గానే తెరకెక్కించాడు. మాస్‌, యూత్‌ ఆడియన్స్‌ను అలరించే డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. కొన్ని సీన్స్‌లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు బాగున్నా.. కథలో కావాలని ఇరికించినట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బలాలు- నటినటులు, మాస్ ఎలిమెంట్స్‌
మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
బలహీనతలు- రొటీన్ స్టోరీ ,స్క్రీన్‌ ప్లే

టైటిల్ :  ఇస్మార్ట్ శంకర్
రేటింగ్ : 2.75/5
జానర్ : మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ

 
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *