వివి వినాయిక్ నెక్ట్స్ చిత్రం ఖరారు, మళ్లీ మెగా హీరోతోనే

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 చిత్రం తీసి సూపర్ హిట్ కొట్టారు. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చెయ్యబోతున్నారనే ఆసక్తి అంతటా మొదలైంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం…మరోసారి ఆయన మెగా హీరోతోనే ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చి సుప్రీమ్ స్టార్ గా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ తో ఆయన ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిస్కషన్స్ అన్ని పూర్తయ్యాయని చెప్పుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ ఈ ప్రాజెక్టు విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారు. వినాయిక్ వంటి స్టార్ డైరక్టర్ తనతో సినిమా సినిమా చేస్తే తనకు పూర్తి స్దాయిలో మాస్ ఇమేజ్ వస్తుందని సాయి ధరమ్ తేజ భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ విన్నర్ చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. అలాగే కృష్ణవంశీ దర్సకత్వంలో రూపొందుతున్న నక్షత్రం చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఖైదీ నెంబర్‌ 150గా ప్రేక్షకుల ముందుకు వస్తే మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ …సంక్రాంతి పండుగ రోజున ట్రైలర్‌తో శుభాకాంక్షలు తెలిపాడు. ‘నీలాంటి వాళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అరుదుగా ఉంటారు. అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్‌, నేను రెడీ’ అంటూ సాయిధరమ్‌ ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌ ఫెర‍్మామ్మెన్స్‌తో హల్‌ చల్‌ చేశాడు. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి విన్న‌ర్‌గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ.

వచ్చే నెల 24న విన్నర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సాయిధరమ్‌ తన ట్విట్టర్‌లో ట్రైలర్‌ను పోస్ట్ చేశాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే 1 మిలియన్ మంది చూశారు. అంతేగాకుండా విన్నర్ లుక్ పట్ల సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ‘విన్నర్‌’ ఫస్ట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), టాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *