బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా ?

బిగ్ బాస్ రియాలిటీ షో మెల్లగా పికప్ అవుతోంది. యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ లేని ఎపిసోడ్స్ నిస్సారంగా సాగినట్టు అనిపిస్తే నిన్నా మొన్నా అమాంతం స్పీడ్ పెంచేసాడు తారక్. ఇక ముందు ముందు ఇది ఆసక్తికరంగా మారుతుంది అనే అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ వల్లే షో డల్ గా ఉంది అన్న విమర్శల నేపధ్యంలో కాస్త మసాలా డోస్ పెంచే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. షోలో వీళ్ళందరితో పాటు మరొక ఆకర్షణీయమైన అంశం ఏంటంటే  అందరికి ఆర్డర్స్ పాస్ చేస్తున్న బిగ్ బాస్ వాయిస్ ది. అది ఎన్టీఆర్ ది కాదు.

అవసరమైన టైం లో ఆర్డర్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళను కంట్రోల్ చేస్తున్న గొంతు ఎవరిదా అని అందరికి సస్పెన్స్ గా ఉంది. హింది బిగ్ బాస్ షో లో అలా వాయిస్ ఓవర్ ఇచ్చింది అతుల్ కపూర్. ప్రముఖ ఆర్టిస్ట్, డబ్బింగ్ స్పెషలిస్ట్ అయిన అతుల్ కపూర్ 2002 నుంచి ఇదే రంగంలో ఉన్నాడు. కాని తెలుగు షోకి మాత్రం ఎవరు గొంతు అరువు ఇచ్చారా అనే డౌట్స్ కి తెరపడినట్టే.

తెలుగు బిగ్ బాస్ కి గొంతు అరువు ఇచ్చింది రాధా కృష్ణ అని తెలిసింది. ఇతను ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో డబ్బింగ్ చెప్పే ఇతగాడు మంచి డిమాండ్ లో ఉన్నాడు. రాధా కృష్ణ తో పాటు శంకర్ కూడా డబ్బింగ్ విషయంలో హెల్ప్ చేస్తున్నట్టు టాక్. శంకర్ మా టీవీ లో వచ్చిన సిఐడి సీరియల్ కు డబ్బింగ్ చెప్పేవాడు. సినిమాల ద్వారా కూడా అందరికి పరిచయమే .

రాధా కృష్ణ ఇప్పటికే ఎన్నో సినిమాలకు హీరో, విలన్ లకు డబ్బింగ్ చెప్పడం ద్వారా బాగా పాపులర్. ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో తెరవెనుక గొంతును అరువిచ్చారు. మొత్తానికి షోలో అందరిని ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ గొంతు ఎవరిదో అన్న సస్పెన్స్ దాదాపు వీడిపోయినట్టే. కాని ఇది ఆఫిషియల్ న్యూస్ కాదు. ఇన్నర్ సోర్సెస్ ద్వారా తెలుసుకున్న సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *