షమీ అక్రమ సంబంధాలు బయట పెట్టిన భార్య

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై అతడి భార్య హాసిన్ సంచలన ఆరోపణలు చేసింది. షమికి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని.. అతడిలోని మరో కోణం జనాలకు తెలియదని ఆమె అంది. షమితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేయడమే కాక చంపడానికి కూడా ప్రయత్నించారని ఆమె ఆరోపించడం గమనార్హం. షమికి.. హాసిన్ కు 2014లో పెళ్లయింది. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉంది. రెండేళ్ల పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది కానీ.. ఆ తర్వాత ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. ఐతే ఇప్పుడు షమి గురించి హాసిన్ మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో ఆమె ఏమందంటే..

ఓ చానెల్‌ తో మాట్లాడుతూ.. ‘2014లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసింది. నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ‘రెండేళ్లుగా షమితో పాటు అతడి కుటుంబసభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నన్ను చంపడానికి  కూడా ప్రయత్నిస్తున్నారు. షమికి ఎంతో మంది అమ్మయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఒక రోజు షమి కారులో మొబైల్ ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే చాలా అసభ్యకర సందేశాలు కనిపించాయి. అవన్నీ చదవడానికి నాకు ఒక రాత్రి సరిపోలేదు. అందులో చాలామంది అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. ఓ పాకిస్థాన్ అమ్మాయితో షమికి పెళ్లి కూడా అయినట్లు వెల్లడైంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ అనంతరం షమి ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్ కు కూడా వెళ్లినట్లు తెలిసింది.

తన కుటుంబం, పాప కోసం ఇన్నిరోజులు వేచి చూసానని, కానీ షమీలో మార్పు రాలేదని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాల సహాయంతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక షమీ, జాహన్‌లకు 2014లో పెళ్లి కాగా వీరిద్దరికి ఒక పాప ఉంది.

కాగా ఈ ఆరోపణలపై మహ్మద్‌ షమీ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే హాసిన జాహన్‌ పోస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడం చర్చనీయాంశమైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *