నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో – నాని

నేచురల్‌ స్టార్‌ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కే కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో నాని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట.ఈ సినిమాలో నాని ఓ క్రైమ్‌ నవలా రచయితగా కనిపించనున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *