కనీస మానవత్వం లేకుండా కన్నా కూతురుపై అత్యాచారం

ఆడపిల్లలకు బయటి సమాజంలోనే కాదు ఇంట్లోనూ రక్షణ కరువవుతున్న పరిస్థితి. బయట ప్రపంచ నుండి కూతుర్ని కాపాడాల్సిన తండ్రి కామాంధుడుగా మరి కన్నబిడ్డలనే కాటేస్తున్న దుస్థితి. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది. కన్న కూతురు అన్న కనీసం మానవత్వం లేకుండా ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ కామాంధుడి అఘాయిత్యాన్ని పెద్ద కూతురు కళ్లారా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన కుమారస్వామి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ హన్మకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుమారస్వామి గత మూడు నెలలుగా తన చిన్న కూతురు(14)పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల అతని పెద్ద కూతురు కళ్లారా ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది. వెంటనే తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *