ఇలియానాకి వింతైన జబ్బు ఉందట, తనే చెప్పింది

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినా హీరోయిన్ ఇలియానా. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఇలియానా బాలీవుడ్ లో నే సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్య బాలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గడంతో, తిరిగి మళ్ళీ టాలీవుడ్ కి రావాలని రవితేజ తో ‘అమర్ అక్బర్ అంథోనీ’ సినిమా లో నటించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈమధ్యనే తన బాయ్ ఫ్రెండ్, ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఈమెకి బ్రేకప్ అయింది. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకళ్ళని ఒకళ్ళు ఫాలో చేయడం, ఇద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ నుండి తొలగించడంతో ఈ విషయం ఖరారైంది.

తాజాగా ఆమె చేసిన ఒక ఫన్నీ ట్వీట్ అందరినీ నవ్విస్తోంది. ”నాకు నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టుండి. నా కాళ్లపై కనిపిస్తోన్న గాయాలు, మచ్చలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. బహుశా ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తినడానికి అర్ధరాత్రి స్లీప్ వాక్ చేస్తున్నానేమో. నేనొక వాకింగ్ స్నాకర్ ని” అంటూ ట్వీట్ చేసింది ఇలియానా. తానొక అర్ధరాత్రి స్నాక్స్ తినే పిచ్చిదాన్ని అంటూ మరో పోస్ట్ చేసింది ఇల్లి. దీనిపై అభిమానులు కొన్ని ఫన్నీ మీమ్స్ తో స్పందిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *