విడుదలకు ముందే సినిమా లీక్‌

స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న సినిమా ముందే ఆన్‌లైన్‌ లీకవడం కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛభారత్‌ను ప్రమోట్ చేస్తూ తెరకెక్కిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది.

లీక‌యిన వీడియో గురించి ముందుగా కోరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా కు తెలియ‌డంతో వెంట‌నే సినిమా ప్రొడ్యూస‌ర్ కు విష‌యాన్ని తెలియ‌జేశాడు. రెమో కు ఓ వ్య‌క్తి క‌లిసి… త‌న వ‌ద్ద టాయిలెట్ మూవీ మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంద‌ని చెప్పాడ‌ట‌. అయితే.. రెమో అత‌డిని ముందుగా న‌మ్మ‌లేద‌ట‌. కాని.. ఆ వ్య‌క్తి పెన్ డ్రైవ్ తీసుకొచ్చి రెమో కు ఇవ్వ‌గా.. పెన్ డ్రైవ్ ను చెక్ చేస్తే అందులో నిజంగానే టాయిలెట్ మూవీ మొత్తం ఉంద‌ట‌.

ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే సమస్యలపై దర్శకుడు నారాయణ్‌ సింగ్‌ ఈ సినిమా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విడుదల కన్నా ముందుగానే సినిమా లీకవడం దర్శకుడు, నిర్మాతలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.అగ‌స్టు 11 న మూవీ రిలీజ‌వ‌నుంది. అక్ష‌య్ కుమార్, నీర‌జ్ పాండే ఈ మూవీకి కో ప్రొడ్యూస‌ర్స్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *