అకున్ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్.. మీ పిల్లలు కష్టాలు కొనితెచ్చుకున్నట్టే

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తున్న ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు అప్పుడే బెదిరింపులు మొదలయ్యాయి. తీగ లాగుతుంటే డొంక కదులుతుండటంతో.. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నవారి గుండెలు అదిరిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్‌ని డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేసింది.  డ్రగ్స్‌ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్‌ చేసి హెచ్చరికలు చేశారు ” నువ్ ఎక్కడ ఉంటావో తెలుసు.. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు.. ఈ కేసులో ఇంకా ముందుకెళితే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే”నంటూ ఫోన్‌కాల్‌లో బెదిరించినట్లుగా తెలుస్తోంది. వాయిస్ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

విచారణను సబర్వాల్ సీరియస్‌గా తీసుకోవడంతో ఇక తమ ఆటలు సాగవేమోనన్న భయంలో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సబర్వాల్ ఫోన్‌కు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10రోజుల క్రితం ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఆఫ్రికన్ యాసలో ఆయన్ను బెదిరించారు.

ముఖ్యంగా సౌతాఫ్రికా నుంచి ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ డ్రగ్ మాఫియా ఎంత దారుణంగా ఉంటుందంటే.. ఒకవేళ తమకు అడ్డువచ్చినటువంటి పోలీసు అధికారి ఎంత పెద్దవారైనా సరే వాళ్లను హతమార్చేందుకు కూడా వెనుకాడని వంటి పరిస్థితి. గతంలో కూడా ఈ దేశంలో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్నుంచి భారీ ఎత్తున ప్రపంచంలోని వివిధ దేశాలకు డ్రగ్స్ వస్తుంటుంది. హైదరాబాద్‌లో కూడా నైజీరియన్ల రూపంలో ఈ డ్రగ్స్ ఎక్కువగా గత కొంత కాలంగా వచ్చేదన్న విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *