‘నగ్న’ దృశ్యాలు కొంత వరకు నిజమే : గుట్టు విప్పిన సంజన (వీడియో)

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దండుపాళ్యం2 సినిమాకు సంబంధించిన ఓ సీన్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ సీన్‌లో నటి సంజనను నగ్నంగా చిత్రీకరించారని, ఆ వీడియో ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులో వాస్తవం లేదని సంజన, ఆ చిత్ర దర్శకుడు చెప్పినప్పటికీ ఆ వీడియో ప్రచారం ఆగడం లేదు. దాంతో హీరోయిన్ సంజన సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని బయటపెట్టింది.

తాను కొంత వరకూ అలా నటించిన మాట వాస్తవమేనని, కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తి నగ్నంగా నటించలేదని ఆమె చెప్పింది. ఫేసుబుక్, ట్విట్టర్ వేదికలుగా ఆమె అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.

జేమ్స్ బాండ్ సినిమా అయినా సరే తాను వంద శాతం నగ్నంగా నటించడానికి అంగీకరించబోనని సంజన చెప్పింది. నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిందని, ఓ నటిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అదే సమయంలో సంప్రదాయాలను, విలువలను, తన ఆత్మగౌరవాన్ని, స్త్రీ వాదాన్ని గౌరవించాలనే బాధ్యతను కూడా దృష్టిలో ఉంచుకుంటానని చెప్పింది.

దండుపాళ్యం2 సినిమాలో చంద్రి అనే తన పాత్రపై ఎంతో మంది సానుభూతి చూపిస్తున్నారని, కానీ నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో చూసి, తనపై సానుభూతి చూపుతున్న విషయం తెలిసి షాకయ్యానని సంజన అన్నది. కేవలం శరీరంపై దుస్తులను మాత్రమే కాదు, మొత్తం వీడియోనే మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఇది తన వ్యక్తిత్వాన్ని దిగజార్చడమేనని ఇలాంటి పబ్లిసిటీ తన జీవితానికి అవసరం లేదని వ్యాఖ్యానించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *