వారెవ్వా.. అర్జున్ రెడ్డి, ఇరగదీశాడు పో..!

మొత్తానికి ఏ ముహూర్తంలో ఆరంభమై, విడుదల అయ్యిందో కానీ,.. అర్జున్ రెడ్డి పట్టిందల్లా బంగారం అయిపోతోంది. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం, తెలుగు సినీ చరిత్రలోనే ప్రత్యేకమైనది అనిపించుకోవడమే కాదు, ఈ సినిమాలో నటించిన వారి తలరాతను కూడా మార్చేస్తోంది. మరి ఈ విషయాల గురించి కూలంకషంగా పరిశీలిస్తే.. అర్జున్ రెడ్డి చాలా ప్రత్యేకమైన సినిమా అని స్పష్టం అవుతోంది.

ముందుగా పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే.. వసూళ్లు.. ఇప్పటి వరకూ ఈ సినిమా పాతిక కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందని సమాచారం. మరి గ్రాస్ వసూళ్లే ఈస్థాయిలో ఉన్నాయంటే.. ఇది భారీ స్థాయి లాభాలను సాధించినట్టే. ఎందుకంటే.. ఈ సినిమాను ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేశారు. అంటే.. రూపాయికి నాలుగు రూపాయల లాభం వచ్చింది. ఈ లాభం కొంత నిర్మాతలకు, కొంత డిస్ట్రిబ్యూటర్లకు దక్కింది. మరి ఈ రోజుల్లో రూపాయికి నాలుగు రూపాయల లాభం సంపాదించిన సినిమా మరోటీ లేదు.

ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ మరింత ఆసక్తికరం. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రీమేక్ కావడం దాదాపు ఖాయమే. కన్నడలో ఇప్పటికే హీరో కూడా ఓకే అయిపోయాడు. తమిళంలో ధనుష్ తీసుకున్నాడు. హిందీలో రణ్ వీర్ సింగ్ ఈ సినిమాను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. ఏకంగా మహేశ్ బాబుతో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఆఫర్లు కూడా దక్కే అవకాశాలున్నాయి. హీరో విజయ్ కి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. హీరోయిన్ శాలినీ పాండేకు అరడజను సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయని సమాచారం. మొత్తానికి ఒక్క అర్జున్ రెడ్డి.. చాలా మంది జాతకాలను మార్చేశాడు. తెలుగు చిత్రసీమ చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *