కలక్షన్స్: బాహుబలి 2 ఫస్ట్ వీకెండ్ అదిరే

”బాహుబలి 2” సినిమా అనుకున్నట్లే మొదటి మూడు రోజులు అద్భుతహా అనిపించుకుంది. సినిమా ఇలా ఉంది అలా ఉంది అని ఎన్ని డిస్కషన్లు రివ్యూలు రీజన్లు వచ్చినా కూడా.. రాజమౌళి చేసిన అద్భుతమైన మార్కెటింగ్ ఫలితంగా దాదపు మొదటి వారం తాలూకు టిక్కెట్లన్నీ ముందుగానే ఫిల్ అయిపోయాయ్. అందువలను అసలు సినిమాకు కలక్షన్ల విషయంలో ఢోకా లేకుండా పోయింది.

మొన్న శుక్రవారం రిలీజైన బాహుబలి 2 మొదటి మూడు రోజులకు (తొలి వీకెండ్)గాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 271+ కోట్లు షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ మూడు రోజుల్లో దాదాపు 74+ కోట్లు వసూలు చేసిన బాహుబలి 2..  కర్ణాటక నుండి 19+ కోట్లు.. తమిళనాడు నుండి 18 కోట్లు.. కేరళ నుండి 8.5+ కోట్లు.. వసూలు చేసింది. భారతదేశంలోని నార్త్ మరియు ఇతర ప్రదేశాల నుండి 71+ కోట్లు వసూలు చేసి.. మొత్తంగా ఇండియా నుండి 191 కోట్ల షేర్ ను రాబట్టింది బాహుబలి రెండో భాగం. ఇక అమెరికాలో ఈ మూడు రోజుల్లో 44 కోట్ల షేర్ వసూలు చేస్తే.. ఎమిరేట్స్ లో 14+ కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఆస్ర్టేలియా నేపాల్ యుకె మొదలగు దేశాలన్నీ కలుపుకుని.. 271 కోట్లు షుమారు వసూలు చేసింది. ఆ విధంగా చూసుకుంటే బాహుబలి 2 మొదటి మూడు రోజుల్లో దడదడలాడించిందనే చెప్పాలి.

బాహుబలి 2 సినిమా మొత్తంగా 350+ కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ విధంగా చూసుకుంటే మరో మూడు రోజుల్లో తాము ఖర్చుపెట్టిన అసలు డబ్బులు వచ్చేయగా.. డిస్ర్టిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టే ఛాన్సుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *