బాహుబలి-2 ప్రీమియర్ షో ముందే వేసేశారా?

ఇన్నాళ్ల ఎదురు చూపులకు.. ఏప్రిల్ 28 తెర దించనుంది. ఎప్పుడెప్పుడా అని సగటు సినీ అభిమాని ఎదురు చూస్తున్న రోజు దగ్గరపడుతోంది. మరో రెండు రోజులు.. బాహుబలి-2 వచ్చేస్తోంది. వస్తూ..వస్తూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడోనన్న ప్రశ్నకు సమాధానాన్ని మోసుకువస్తోంది. అయితే.. ఇన్నాళ్లూ సినిమా కోసం నిరీక్షించినా ఆ సినిమాకు సంబంధించి మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాహుబలి-2 సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

ఆ ఫొటోలు చూసిన వారూ.. అప్పుడే బాహుబలి-2 ప్రీమియర్లు మొదలైపోయాయా..? అని షాకవుతున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్లతో బాహుబలి-2 ప్రభంజనానికి తెర లేవాల్సి ఉంది. భారత్‌లో శుక్రవారం ఉదయం నుంచి ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. కానీ, సినిమాలోని కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్‌లో ప్రత్యక్షమవడంతో అప్పుడే సినిమా ప్రీమియర్ పడిపోయిందా అని బాహుబలి అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే.. పలువురు మాత్రం సెన్సార్ సభ్యులకు షో వేసినప్పుడు తీసిన ఫొటో అయి ఉండొచ్చన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *