క్షమించమంటూ కన్నడ ప్రజలకు కట్టప్ప క్షమాపణలు

కావేరీ జలాల వినియోగంపై నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్నాటక ప్రజల్ని హర్ట్‌ చేసాయి. దాంతో అతడు నటించిన సినిమాలని కర్నాటకలో విడుదల కానీయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏప్రిల్‌ 28న కర్నాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని అంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌ 28న కర్నాటక బంద్‌ కూడా తలపెట్టారు నిరసనకారులు.

నిజానికి కర్నాటక చరిత్రలోనే బాహుబలి అతి పెద్ద విజయాన్ని సాధించింది. దాంతో రెండో భాగంపై ఇంకా భారీ స్థాయిలో వ్యాపారం జరిగింది. ఇప్పుడీ వ్యవహారం ముదిరి సినిమా ప్రదర్శన కనుక నిలిచిపోతే.. నలభై కోట్లు పెట్టి హక్కులు తీసుకున్న బయ్యర్‌ మునిగిపోతాడు.

ఎగ్జిబిటర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంత మంచిదని కర్ణాటక బాహుబలి వ్యాపారులు కోరుతున్నారు. ముందు ఈ ఇష్యూ సింపుల్ గా స‌మ‌సిపోయేలా క‌నిపించినా.. రోజురోజుకు ఇంకా కాంప్లికేట్ అవుతుంది. దాంతో స్వ‌యంగా ఇప్పుడు రాజ‌మౌళే రంగంలోకి దిగాడు.

రాజమౌళి కన్నడలో మాట్లాడినంతమాత్రాన సరిపోదని, సత్యరాజ్ తో క్షమాపణలు చెప్పించాలని కన్నడ ధళవళపార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు సూచించారు. కట్టప్ప నేరుగా కర్ణాటకకి వచ్చి క్షమాపణ చెప్పకపోయిన , సోషల్ మీడియా ద్వారా అయిన అప్పుడు మాటలు వెనక్కు తీసుకుంటే సరిపోతుందని వారు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు దిగొచ్చిన సత్యరాజ్‌ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన చేశారు. తాను కన్నడ ప్రజలకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన వల్ల బాహుబలి వంటి గొప్ప చిత్రానికి ఇబ్బందులు రావడం ఇష్టం లేదని, ఈ సినిమాను ప్రతి ఒక్కరికీ చేర్చాల్సి వుందని అన్నారు. కన్నడ ప్రజలంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో తన వ్యాఖ్యల పట్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *