ఐపీఎల్ లో మహ్మద్ సిరాజ్ అరంగేట్రం అదుర్స్
హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్ లోనే సత్తా చాటుకొన్నాడు. హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ముగిసిన మ్యాచ్ ద్వారా బరిలోకి దిగిన సిరాజ్ తన కోటా నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు శామ్ బిల్లింగ్స్ 13 పరుగుల స్కోరుకు వికెట్ కీపర్ నమన్ ఓజా పట్టిన క్యాచ్ కు అవుట్ కాగా సంజుశాంప్సన్ 42 పరుగులకు హెన్రికేస్ పట్టిన క్యాచ్ కు సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యారు. మొత్తం మీద ఐపీఎల్ పదోసీజన్ వేలంలో 2 కోట్ల రూపాయల ధర పలికిన సిరాజ్..అరంగేట్రం మ్యాచ్ లోనూ తానేమిటో నిరూపించుకొన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి వారేవ్వా అనిపించుకొన్నాడు.