2 వారాలు 16 గంటలు కష్టపడ్డారంటే.. వావ్ బాలయ్య అనాల్సిందే

రెండు షిఫ్టులు.. మూడు షిఫ్టులు లెక్కన హీరోలు.. హీరోయిన్లు పని చేసేవారని చరిత్రలో చెప్పుకుంటామంతే. కానీ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ.. ఇప్పటికీ అంతే కష్టపడుతుండడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

స్టార్ స్టేటస్ ఉన్నవారితో పాటు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకట్రెండు హిట్స్ కొట్టిన హీరోలు కూడా.. షూటింగ్ అవలేదు అని చెప్పి సింపుల్ గా పోస్ట్ పోన్ చేసి పారేస్తున్నారు. నెలలు నెలలు సినిమాలను ల్యాబ్స్ లో మూలిగేలా చేస్తున్నారు. ఇదంతా నిర్మాతలు భారంగా మారిపోతోంది. కానీ ఇలాంటి విషయాల్లో నిర్మాతల పాలిట బాలయ్య ఓ బ్రహ్మాండమైన వ్యక్తి. పొంగల్ రిలీజ్ అనుకున్న సినిమా.. ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఉండేందుకు.. తన సపోర్ట్ సంపూర్తిగా ఇచ్చేశారు. ఈ వయసులో బాలయ్యను 16గంటలపాటు కష్టపెట్టాలని ఎవరికీ ఉండదు. ఎవరూ అడగరు కూడా.

కానీ బాలకృష్ణ మాత్రం స్వచ్ఛందంగా తనే ముందుకొచ్చి సినిమా కంప్లీట్ చేసేందుకు కృషి చేశారు. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పూర్తి చేయడంలో.. కీలక పాత్ర పోషించారు. ఏకంగా రెండు వారాలు పాటు రెస్ట్ లేకుండా రోజుకు 16 గంటలు కష్టపడ్డారంటే.. వావ్ బాలయ్య అనాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *