జియో దందా, మోసపోకండి

జియో… 2015 డిసెంబర్ 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ధీరభాయ్ అంబానీ.. 83వ పుట్టిన రోజు సంధర్భంగా లో ముఖేష్ అంబానీచే స్థాపించబడిన ఈ సంస్థ, అనతి కాలంలోనే.. పోటీ నెట్ వర్క్స్ ని పక్కకు తోసేసి నెం.1 స్థానంలో నిలిచింది, మొబైల్ నెట్ వర్క్ రంగంలో జియోకు ముందూ.. జియోకు తరువాత అన్నట్టుగా.. మార్పులను తెచ్చింది, కానీ.. ఇప‌్పుడీ జియో.. దందాలకు మారుపేరు అయ్యింది, జియో పేరుతో మోసాలు, అక్రమాలకు తలబడుతూ.. ప్రజల నుండి లక్షల రూపాయల్లో.. డబ్బులు గుంజేస్తున్నారు, అవును, ఇది నిజం.jio-2019

వివరాల్లోకి వెళ్తే.. జియో తన సామ్రాజ్యాన్ని విస్తరించటానికి తీవ్ర ప్రయత్నాల్లో..  ఉంది, ఇందులో భాగంగా.. జియో సెల్ టవర్స్, జియో బ్రాడ్ బ్యాండ్ కి సంబంధించిన పోల్స్‌ (స్థంబాలను) దేశ వ్యాప్తంగా పెంచుకుంటూ పోతుంది, ఇందు గలదందు లేదని సందేహము వలదన్నట్టుగా.. ప్రతి పల్లె, ప్రతి వీధిని తన నెట్ వర్క్ మయం చేయబోతుంది, ఇందుకోసం ఇప్పటికే.. చాలా వరకు వాడ వాడలా.. జియో బ్రాడ్ బ్యాండ్ పిల్లర్స్ ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది, అయితే.. ఇదే అదునుగా తీసుకున్న కొందరు ముఠా వ్యక్తులు, ఇంటింటికీ తిరుగుతూ.. తాము, జియో కంపెనీ నుండి వచ్చామని, ఇంటిపై నెట్ వర్క్ టవర్ ని ఏర్పాటు చేస్తామని, మీరు ఊహించని మొత్తాన్ని నెలనెలా.. (వేలు, లక్షలు) అద్దెగా చెల్లిస్తామని చెప్తూ.. నమ్మబలికి, ఇందుకోసం కంపెనీకి డిపాజిట్ రూపేనా.. అడ్వాన్స్ రూపేనా.. కొంత డబ్బు చెల్లించాలని చెప్పి, దొరికినంతా.. దోచుకొని మాయమవుతున్నారు. ఇప్పటికే.. దేశ వ్యాప్తంగా చాలా మంది భాదితులు దీని భారిన పడ్డారని తెలుస్తుంది.

 

దీనిపై జియో యాజమాన్యం స్పందిస్తూ… మేము ప్రజల నుండి ఎలాంటి రుసుము, సొమ్ము వసూలు చేయబోమని, ఇప్పటి వరకూ.. అలాంటిది జరగలేదని, మా సంస్థ తరపున నెట్ వర్క్ ఏర్పాట్లు జరిగినప్పటికీ.. ఎక్కడైనా.. ఉచితంగానే.. ఏర్పాటు చేసామని, ఇలాంటి మోసగాల్ల మాయలో పడి మీ డబ్బును వృధా చేసుకోవద్దని, ఇందుకు కంపెనీతో ఎలాంటి సంబంధం ఉండదని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది, ఇదే విషయాన్ని జియో నెట్ వర్క్ యూజర్లకు మెసేజ్ రూపకంగా కూడా పంపడం జరిగింది, కాబట్టి ఫ్రెండ్స్, ఎవరో ఏంటో తెలుసుకోకుండా.. ఊరికే.. నమ్మి మీ సొమ్మును, విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి, జియో దందాతో తస్మాత్ జాగ్రత్త.

 

దీ జియో.. మరిప్పుడు ఈ దందా మాటేంటి? జియో పేరుతో నడుస్తున్న అవినీతి ఏంటి? ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *