బిగ్ బాస్ -3 ఈ సారి ఆరుగురు

బిగ్ బాస్ -3 37 వ ఎపిసోడ్ లో ఈ రోజు ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రీయ పూర్తయింది. మొదట శ్రీముఖి, బాబా భాస్కర్ నగిన నగిన అనే పాటకు స్టెప్పులేశారు. ఎపిసోడ్ ప్రారంభంలో ముచ్చట్లు మొదలు పెట్టారు రాహుల్, పునర్నవిలు. తనతో వాదనకు దిగిన పునర్నవికి ఊహించని షాక్ ఇచ్చాడు రాహుల్. బయట నీలాంటోళ్లు బొచ్చుడు మంది ఉన్నారు. అసలు నువ్ నాకు ఏమి అవుతావ్ చెప్పు. నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్‌వి మాత్రమే. నాకోసం కోసుకునే వాళ్లు ఉన్నారు అంటూ పునర్నవికి తో రాహుల్. దీనితో వీరిద్దరిని నీ ఏకంగా చేసేందుకు వితికా, వరుణ్‌లు గట్టిప్రయత్నమే చేశారు. వాడితో మాట్లాడు అని పునర్నవిని రాహుల్ దగ్గరకు తీసుకురావడంతో వాడితో నేను మాట్లాడేది ఏంటి? వాడి నవ్వుచూస్తుంటే మండిపోతుంది. అయినా నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది చాలు బిగ్ బాస్ ఇక ఉండలేను.. నన్ను పంపించేయండి’ అంటూ బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేసింది పునర్నవి.  హౌస్ లో వారం మొత్తంలో జరిగిన వాటిపై వీక్లీ పేపర్ పంపించారు బిగ్ బాస్. ఇందులో పునర్నవి లవ్ ట్రాక్, బాబా భాస్కర్ వంట. అలీ ఖండలపై ఫన్నీ వార్తల్ని విడుదల చేశారు

ఈ సారి నామినేషన్స్ లో హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శివజ్యోతికి ఈ నామినేషన్ నుండి మినహాయింపు లభించగా.. హౌస్‌లో మిగిలిన 10 మంది సభ్యుల్ని ఇద్దరిద్దరుగా డివైడ్ కావాలని ఆదేశించారు. దీంతో రవి-అలీ, శ్రీముఖి-హిమజ, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, బాబా భాస్కర్‌- మహేష్‌‌లు జోడీ కట్టారు. ఈ జంటల్లో ఒక్కర్ని సేవ్ చేసి.. మరొకర్ని నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్‌లో రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్‌లను ఎక్కువ మంది ఎలిమినేషన్‌కి నామినేట్ చేయగా.. ఎవరూ నామినేట్ చేయకుండా మిగిలిన శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, వితికా షెరులలో ఒకర్ని హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శివజ్యోతి డైరెక్ట్‌గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరారు. దీంతో శివజ్యోతి.. వరుణ్ సందేశ్‌ను డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *